/rtv/media/media_files/2025/05/11/cD74lDRNQ5keScFMIPOH.jpg)
Zelensky
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన ప్రకటన చేశారు. రష్యాతో తాము ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోందని చెప్పారు. చాలారోజులుగా ప్రపంచం దీనికోసమే ఎదురుచూస్తోందని తెలిపారు. యుద్ధాన్ని ముగించేందుకు మొదటి అడుగు కాల్పుల విరమణే అని పేర్కొన్నారు. ఈ మారణకాండను ఒక్కరోజు కొనసాగించడంలో కూడా ఎలాంటి అర్థం లేదని చెప్పారు.
Also Read: పుల్వామా నిందితులను లేపేసాం - ఇండియన్ ఆర్మీ మరో సంచలన ప్రకటన
రష్యా కాల్పుల విరమణ ధ్రువీకరణ కోసం చూస్తున్నామని.. రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదిలాఉండగా.. సోమవారం నుంచి మొదలుకానున్న 30 రోజుల కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని బ్రిటన్‌తో పాటు యూరప్ దేశాల అధినేతలు హెచ్చరిస్తున్నారు. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చిచెప్పారు.
Also Read: హైదరాబాద్‌లో కరాచీ బేకరి ధ్వంసం.. పేరు మారుస్తారా? బోర్డు తీస్తారా? - వీడియో!
మరోవైపు ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేందుకు తాము కూడా రెడీగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. ఇస్తాంబుల్‌ను చర్చల వేదికగా ప్రకటించారు. వీటి వల్ల ఇరుదేశాల మధ్య పూర్తిస్థాయిలో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతేకాదు తాము ఇప్పటికే మానవతా దృక్పథంతో స్పందించి ఉక్రెయిన్‌కు చెందిన ఇంధన వనరులపై దాడులు చేయడం ఆపేసినట్లు పేర్కొన్నారు. ఈస్టర్ కాల్పుల విరమణ, విక్టరీ డే కాల్పుల విరమణ వంటివి ప్రకటించినట్లు చెప్పారు.
Also Read: ఈ రాత్రికి ఒక్క డ్రోన్ వచ్చినా.. రేపటికి పాక్ ఉండదు.. భారత్ సీరియస్ వార్నింగ్!
Also Read: పాకిస్తాన్ను లేపేస్తాం.. ఇండియాకు మా ఫుల్ సపోర్ట్.. BLA సంచలన ప్రకటన!
telugu-news | russia-ukraine-war