iPhone Security: ఐఫోన్ వాడేవారికి బిగ్ అలెర్ట్.. కేంద్రం వార్నింగ్!

మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త సుమీ. తాజాగా భారత ప్రభుత్వం ఐఫోన్ వాడేవారికి కీలక సూచనలు జారీ చేసింది. ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ వంటి యాపిల్ పరికరాల్లో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియా హెచ్చరికను విడుదల చేసింది.

New Update
iPhone Security

iPhone Security

iPhone Security: మీరు ఐఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త సుమీ. ఇటీవలే  భారత ప్రభుత్వం ఐఫోన్ వాడేవారికి కీలక సూచనలు జారీ చేసింది. ఐఫోన్, ఐపాడ్, మ్యాక్ వంటి యాపిల్ పరికరాల్లో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియా హెచ్చరికను విడుదల చేసింది. ఈ లోపాల వల్ల హ్యాకర్లు మీ ఫోన్ లోకి సులభంగా ప్రవేశించి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఉంది. ఉదాహరణకు.. మీ ఫోన్ లోని డేటాను దొంగిలించడం, మీకు తెలియకుండానే మీ ఫోన్ లో ఏదైనా కోడ్ రన్ చేయడం, హ్యాక్ చేయడం, ఫోన్ పనిచేయకుండా ఆపేయడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ సమస్యలన్నీ చాలా తీవ్రమైనవని, దీనివల్ల మీ ఫోన్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం కూడా ఉందని CERT-In హెచ్చరించింది.

ముఖ్యంగా ఈ సెక్యూరిటీ సమస్య పాత వెర్షన్ iOS, iPadOS సాఫ్ట్‌వేర్ వాడే ఐఫోన్, ఐప్యాడ్ లకు ఎక్కవగా  ఉంది. iOS 18.6 కంటే ముందు వెర్షన్లు iPadOS 17.9.9 ఐఫోన్లను ఈ సమస్య ఉంది. అలాగే 18.6 కంటే ముందు వెర్షన్ల ఐపాడ్స్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. లేటెస్ట్ వెర్షన్ ఐఫోన్ 15, యాపిల్ వాచ్ లు, మ్యాక్ కంప్యూటర్లలో ఈ సెక్యూరిటీ సమస్య వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: OG MOVIE: పవన్ 'OG'  నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీ ప్లాన్ ! అంత మొత్తం పెడుతున్నారా?

మీరు ఏం చేయాలి?

అయితే ఈ సమస్యకు యాపిల్ పరిష్కారం కూడా అందించింది. హై ఎండ్ సెక్యూరిటీ కోసం మీ యాపిల్ పరికరాల్లో వెంటనే లేటెస్ట్ సాఫ్ట్వేర్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ సెక్యూర్ గా ఉంటుంది.

అప్‌డేట్ చేసుకోవడానికి ఈ పద్ధతిని అనుసరించండి

  1. మీ ఫోన్ లో ముందుగా  సెట్టింగ్స్ కి వెళ్ళండి.

  2. ఆ తర్వాత జనరల్ (General) లోకి వెళ్ళండి.

  3. అక్కడ  సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (Software Update)  మీద క్లిక్ చేయండి.

  4. అక్కడ ఏదైనా కొత్త అప్‌డేట్ కనిపిస్తే, దానిని వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

ఎల్లప్పుడూ మీ ఐఫోన్ లేదా యాపిల్ పరికరాలు సేఫ్ గా ఉండాలంటే, ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమైనది. అలాగే తెలియని లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి.  థర్డ్ పార్టీ యాప్ లను కూడా ఇన్‌స్టాల్ చేయడం ప్రమాదకరం. కేవలం యాపిల్ స్టార్ లో ఉన్న యాప్స్ మాత్రమే సురక్షితమైనవి. 

Also Read: Extended Working: ఆఫీస్‌లో అదనపు గంటలు పనిచేస్తున్నారా ? సర్వేలో షాకింగ్ నిజాలు

Advertisment
తాజా కథనాలు