/rtv/media/media_files/2025/08/24/most-viewed-videos-2025-08-24-12-31-50.jpg)
Most Viewed Videos
Most Viewed YouTube Videos: నేటి డిజిటల్ యుగంలో యూట్యూబ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఈ ప్లాట్‌ఫామ్‌ను రోజూ ఉపయోగిస్తూ వీడియోలు చూస్తున్నారు. అయితే యూట్యూబ్ లో ఇప్పటివరకు ఉన్న డేటా ప్రకారం అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియోస్ ఏవో మీకు తెలుసా..? కొన్ని వీడియోలు యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతూ చరిత్ర సృష్టించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
2025 నాటికి, "Baby Shark Dance" అనే పిల్లల పాట అన్ని వీడియోలను తలదన్నుతూ యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న వీడియోగా రికార్డు సృష్టించింది. 2016లో కొరియన్ బ్రాండ్ అయిన Pinkfong ఈ వీడియోను రిలీజ్ చేయగా, ప్రస్తుతం ఇది 15 బిలియన్‌కి పైగా వ్యూస్ సాధించింది. ఇది యూట్యూబ్ చరిత్రలో 10 బిలియన్ వ్యూస్ దాటిన తొలి వీడియోగా రికార్డ్ క్రియేట్ చేసింది.
దీనికి తరువాతి స్థానం 2017లో వచ్చిన స్పానిష్ పాట "Despacito" (Luis Fonsi, Daddy Yankee) వీడియో సాంగ్ ఉంది. ఇది ప్రస్తుతం 8.63 బిలియన్ వ్యూస్ తో రెండో స్థానంలో ఉంది.
Also Read: వావ్.. వాటే కాన్సెప్ట్..! రోబో కుక్కలతో ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..?
మ్యూజిక్ వీడియోల హవా..
గమనించదగ్గ విషయం ఏమిటంటే, యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోలు చాలా వరకు మ్యూజిక్ వీడియోలే. 2010 తరువాత యూట్యూబ్ పై ప్రొఫెషనల్ కంటెంట్‌కి డిమాండ్ పెరిగింది. వైరల్ ఫన్నీ క్లిప్స్ కంటే, హై క్వాలిటీ సాంగ్స్‌కు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి.
/filters:format(webp)/rtv/media/media_files/2025/08/24/most-viewed-videos-on-youtube-2025-08-24-12-38-05.jpeg)
NOTE: వీక్షణలు ఏప్రిల్ 21, 2025 నాటికి నమోదు చేయబడ్డాయి
సినిమా ట్రైలర్లు..
మ్యూజిక్ వీడియోలతో పాటు, సినిమా ట్రైలర్లు కూడా యూట్యూబ్‌లో విపరీతమైన హిట్స్ అందుకుంటున్నాయి. ఉదాహరణకు, Avengers: Endgame ట్రైలర్ మొదటి 24 గంటల్లోనే 289 మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఇక Spider-Man: No Way Home ట్రైలర్ అయితే దాన్ని అధిగమించి, 355 మిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించింది.
పిల్లల వీడియోలకు ఫుల్ డిమాండ్..
పిల్లలకు సంబంధించిన వీడియోలు, ముఖ్యంగా నర్సరీ రైమ్స్, కూడా యూట్యూబ్‌లో భారీగా వ్యూస్ సాధిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు సులభంగా వినోదం, విద్య కలగలిపిన కంటెంట్ అందించేందుకు యూట్యూబ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగా పిల్లల వీడియోలు అంతర్జాతీయంగా విపరీతంగా ఫేమస్ అవుతున్నాయి.
యూట్యూబ్: ప్రపంచ రెండో అతిపెద్ద వెబ్‌సైట్..
Googleకు చెందిన యూట్యూబ్, 2025 నాటికి 2.70 బిలియన్ యాక్టివ్ యూజర్లు కలిగి ఉంది. ఒక్కో విజిట్‌కు సగటున 20 నిమిషాల 47 సెకండ్లు గడిపే యూజర్లు, దీన్ని ప్రపంచంలో రెండో అత్యంత ఎక్కువగా సందర్శించే వెబ్‌సైట్ గా నిలబెట్టారు.
ప్రతి రోజూ లక్షల కొత్త వీడియోలు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంటే, వాటిలో కొన్ని మాత్రమే రికార్డ్ వ్యూస్ తెచుకుంటున్నాయి. వీటిలో మ్యూజిక్, పిల్లల పాటలు, ట్రైలర్లు లాంటి విభిన్న జానర్ల వీడియోలు ఉండడం విశేషం.