Oppo Reno 14 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. 50MP+50MP కెమెరాతో కొత్త ఫోన్

Oppo Reno 14 5G సిరీస్‌ భారతదేశంలో లాంచ్ అయింది. ఇందులో Reno 14 5G, Reno 14 Pro 5G మోడల్స్ ఉన్నాయి. ఇది పెర్ల్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. జూలై 8 నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనుక్కోవచ్చు.

New Update
Oppo Reno 14 5G Launched

Oppo Reno 14 5G Launched

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కొత్త కొత్త ఫోన్లను లాంచ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరొక కొత్త మొబైల్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. తాజాగా Oppo Reno 14 5G సిరీస్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. కంపెనీ ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా ఫోటోగ్రఫీ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో Oppo Reno 14 5Gతో పాటు Oppo Reno 14 Pro 5G ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, స్పెసఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.

Also Read :  వర్షాకాలం జుట్టు సంరక్షణకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Oppo Reno 14 5G Price

భారతదేశంలో Oppo Reno 14 5G స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. 

8GB + 256GB వేరియంట్ ధర రూ. 37,999. 
12GB + 256GB వేరియంట్ ధర రూ. 39,999 
12GB + 512GB వేరియంట్ ధర రూ. 42,999గా కంపెనీ నిర్ణయించింది. 

ఇది పెర్ల్ వైట్, ఫారెస్ట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్‌ను జూలై 8 నుండి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఇండియా వెబ్‌సైట్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుక్కోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై 10 శాతం వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా పొందొచ్చు.

Also Read :  మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

Oppo Reno 14 5G Specifications

Oppo Reno 14 5G మొబైల్ 6.59 -అంగుళాల 1.5K ఫ్లాట్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. దీనికి ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత ColorOS 15పై నడుస్తుంది.  ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. 

ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ (OIS) కెమెరా, 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP66+IP68+IP69 రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. 

Also Read :  పాక్‌ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం..

Also Read :  ఎవరికీ భయపడేది లేదు.. కొండా మురళి సంచలన కామెంట్స్

oppo-reno | oppo-reno-series | tech-news-telugu | telugu tech news | tech-news

Advertisment
Advertisment
తాజా కథనాలు