Oppo A5 Pro 5G: అప్పు చేసైనా ఒప్పో కొనేయాలి భయ్యా.. కొత్త మొబైల్ అదిరిపోయింది!

టెక్ బ్రాండ్ ఒప్పో త్వరలో ఒప్పో ఏ5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయనుంది. దీని 8/128GB వేరియంట్ ధర రూ.17,999, 8/256GB వేరియంట్‌ ధర రూ.19,999గా ఉంది. ఇది 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

New Update
Oppo A5 Pro 5G

Oppo A5 Pro 5G

Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ గత ఏడాది చైనాలో లాంచ్ అయింది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్‌లో వేరే డిజైన్‌, మరిన్ని కొత్త స్పెసిఫికేషన్లతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 24న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇదే విషయాన్ని ఒప్పో స్వయంగా వెల్లడించింది. అయితే ఈ లాంచ్‌కు కొన్ని రోజుల ముందు ఈ ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. దాని బట్టి Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో బడ్జెట్ ధరలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.

Also Read: “ఓదెల 2” ఫస్ట్ డే కలెక్షన్స్ తుస్.. విజువల్స్ ఎక్కువ విషయం తక్కువ..!

Oppo A5 Pro 5G

భారతదేశంలో Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ బేస్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.17,999గా కంపెనీ నిర్ణయించింది. అదే సమయంలో దీని 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.19,999గా ఉంది. ఇటీవల భారతదేశంలో Oppo A5 Pro 5G లాంచ్ తేదీని నిర్ధారించింది. Oppo రాబోయే హ్యాండ్‌సెట్ కొన్ని కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. ఈ ఫోన్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో వస్తుంది. ఇది డ్యామేజ్-ప్రూఫ్, డ్రాప్-రెసిస్టెంట్ 360-డిగ్రీల ఆర్మర్ బాడీతో వస్తుంది. ఇది 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 

Also Read: 'రాబిన్ హుడ్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

చైనాలో లాంచ్ అయిన Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కంపెనీ గ్లోబల్ వేరియంట్‌ను ఇప్పుడు భారత మార్కెట్‌లోకి పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా గ్లోబల్ వేరియంట్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. అయితే చైనీస్ వేరియంట్ MediaTek Dimensity 7300 SoCతో వస్తుంది. 

Also Read: ఫ్యాన్స్‌ మీట్‌లో షాకింగ్ డెసిషన్ బయటపెట్టిన సూర్య..

Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ (1,080 x 2,412 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ, 2-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

 

tech-news | telugu tech news | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు