/rtv/media/media_files/2025/10/17/moto-g06-power-price-cut-in-flipkart-diwali-sale-mobile-offers-2025-10-17-08-51-45.jpg)
Moto G06 Power price cut in flipkart diwali sale mobile offers
మీ బడ్జెట్ రూ.8000 కంటే తక్కువ ఉందా?.. మీరు 50 మెగాపిక్సెల్ కెమెరా, 7,000mAh బ్యాటరీతో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం. ప్రముఖ ఆన్ లైన్ సంస్థ Flipkart Big Bang Diwali Sale ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండుగ సేల్(diwali-offers) సమయంలో Moto G06 Power పై ఎవరూ ఊహించని తగ్గింపు(Best Mobile Offers)ను అందిస్తున్నారు. అది మాత్రమే కాకుండా బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా కస్టమర్‌లు మరింత డబ్బును ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు Moto G06 పవర్‌పై అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్‌ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: 50mp ఫ్రంట్ కెమెరా స్మార్ట్ ఫోన్ పై రూ.4వేల భారీ తగ్గింపు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే
Moto G06 Power Offers
Moto G06 Powerలోని 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,499 కు లిస్ట్ అయింది. అదే సమయంలో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.300 తగ్గింపు ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత దీని ధర రూ.7,199 కి చేరుకుంటుంది. అదనంగా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.5,450 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో Moto G06 Power కేవలం రూ. 1,749లకే లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ పూర్తి ప్రయోజనం పొందాలంటే.. ఎక్స్ఛేంజ్ చేస్తున్న ఫోన్ ప్రస్తుత పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.
Moto G06 Power Specs
Moto G06 Power ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 720x1640 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 600 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. Moto G06 Power స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హలో UIపై నడుస్తుంది. Moto G06 Power ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. Moto G06 Power ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP64-రేటెడ్‌ను కలిగి ఉంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే.. Moto G06 Power వెనుక భాగంలో f/1.8 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఇది సెల్ఫీల కోసం f/2.0 అపెర్చర్‌తో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. Moto G06 Power స్మార్ట్‌ఫోన్ 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో.. ఇది 4G LTE ఫోన్. ఇందులో Wi-Fi, బ్లూటూత్ 6.0, GPS, గ్లోనాస్, గెలీలియో, QZSS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం Moto G06 Power ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.