జియో దీపావళి ధమాకా: 60 రోజులు ఫ్రీ.. అన్‌లిమిటెడ్ డేటా, 11కి పైగా OTTలు, 1000కి పైగా టీవీ యాక్సెస్ పొందే అద్భుత అవకాశం

జియో దీపావళి ఆఫర్‌లో ప్రకటించింది. వినియోగదారులు 60 రోజుల ఉచిత JioHome ట్రయల్‌ను పొందుతారు. ఇందులో అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, 1000+ టీవీ ఛానెల్స్, 11+ ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ లభిస్తుంది. ఈ ఆఫర్ ప్రస్తుతం జియో సిమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.

New Update
Jio Diwali Damaka (1)

దీపావళి పండుగ(Diwali 2025) కు మరికొద్ది రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా కంపెనీ జియో హోమ్ (JioHome) సేవలను 2 నెలలు (60 రోజులు) ఉచితంగా పొందవచ్చు. ఈ ప్యాకేజీలో అపరిమిత హై-స్పీడ్ ఇంటర్నెట్, టీవీ ఛానెల్‌లు, ప్రముఖ OTT (ఓటీటీ) యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి. దీని ప్రత్యేకత ఏంటంటే.. కొత్తగా లేదా ఇప్పటికే ఉన్న వినియోగదారులు ఇద్దరూ ఈ ఆఫర్ నుండి ప్రయోజనం పొందుతారు.

Also Read :  iQOO Z10R 5G : ధర తక్కువ ఫీచర్లెక్కువ.. 6500mAh బ్యాటరీ, 12GB RAM ఫోన్ ఊరమాస్!

Jio Diwali Dhamaka Offer

Jio Home ఆఫర్ కింద.. కంపెనీ జియోఫైబర్, ఎయిర్ ఫైబర్ సేవలకు దాదాపు 2 నెలల (దాదాపు 60 రోజులు) ఉచిత ట్రయల్ లభిస్తుంది. ఈ ట్రయల్‌లో భాగంగా అపరిమిత వై-ఫై ఇంటర్నెట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు రౌటర్లు, సెట్-టాప్ బాక్స్‌లు, ఇన్‌స్టాలేషన్‌తో సహా అన్ని సేవలను ఉచితంగా పొందుతారు. ఈ ఆఫర్ మొదట 50 రోజులకు ఉండేది.. కానీ దీపావళి దృష్ట్యా దీనిని 60 రోజులకు పొడిగించారు.

ఈ ఆఫర్ కింద జియో తన కస్టమర్లకు ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్‌ను మాత్రమే కాకుండా 1,000+ డిజిటల్ టీవీ ఛానెల్‌లు, 11 కంటే ఎక్కువ OTT యాప్‌లను కూడా అందిస్తోంది. దీని బట్టి జియో హోమ్ సర్వీస్ కింద.. ఒకేసారి మూడు సర్వీస్ లను.. టీవీ, OTT, Wi-Fi పొందుతారు. ఈ 11కి పైగా OTT యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లో.. నెట్‌ఫ్లిక్స్ (Netflix), జియోహాట్‌స్టార్ (JioHotstar), సోనీలివ్, జీ5 వంటివి ఉండే అవకాశం ఉంది. 

Also Read :  Amazon Diwali Offers : చవక చవక.. ఐఫోన్ 15 వెరీ చీప్ - అమెజాన్ దివాళీ సేల్ లో వీటిపై 80% డిస్కౌంట్..

ఈ ఆఫర్ ఎలా పొందాలి?

ఈ ఆఫర్ ప్రస్తుతం జియో సిమ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ముందుగా మీ ప్రాంతంలో జియో హోమ్ సేవలు (జియోఫైబర్ లేదా జియో ఎయిర్‌ఫైబర్) అందుబాటులో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దీనికోసం జియో అధికారిక వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లోకి వెళ్లి మీ పిన్ కోడ్, ఇన్‌స్టాలేషన్ అడ్రస్ ఎంటర్ చేసి అర్హతను చెక్ చేయాలి. మీ ప్రాంతంలో సేవలు అందుబాటులో ఉంటే 'Confirm Interest' బటన్‌పై క్లిక్ చేసి నిమిషాల్లో ఆఫర్‌ను యాక్టివేట్ చేయవచ్చు. ఇక ఈ ట్రయల్ ముగిసిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా నెలకు రూ.599 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ప్లాన్‌లకు మైగ్రేట్ అవుతారు. 

ఇక ఈ 60 రోజులు ఉచిత ట్రయల్ ప్రారంభమవుతుంది. మీరు ఎటువంటి డబ్బు చెల్లించకుండానే హై-స్పీడ్ ఇంటర్నెట్, టీవీ, ప్రీమియం OTT కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.

Advertisment
తాజా కథనాలు