Laptop Offers: అరే భయ్యా ఆఫర్లు అదిరిపోయాయ్.. అమెజాన్ కొత్త సేల్‌లో ఈ 5 ల్యాప్‌టాప్‌లు వెరీ చీప్!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో ల్యాప్‌టాప్‌లపై 44% భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ASUS Vivobook 15 రూ. 32990, HP 15s రూ.34990, Dell Vostro రూ.31990, Lenovo IdeaPad 3 రూ. 32999, Acer Aspire Lite రూ. 32990కి కొనుక్కోవచ్చు. ఇవన్నీ రూ.50వేలకు పైగా ధర కలిగినవి.

New Update
Amazon Great Summer Sale 2025 laptops

Amazon Great Summer Sale 2025 laptops

అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్‌ సమయంలో బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్ కొనాలని ఆలోచిస్తుంటే.. ఇదే సరైన అవకాశం. ల్యాప్‌టాప్‌లపై 44% వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అమెజాన్‌లో HP, Dell, Lenovo, Acer, Asus ల్యాప్‌టాప్‌లపై తగ్గింపును పొందవచ్చు. 

Also read : 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!

బ్యాంక్ ఆఫర్‌లు - డిస్కౌంట్‌లు

తక్కువ ధరకు ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి మరొక అద్భుతమైన అవకాశం బ్యాంక్ డిస్కౌంట్, ఆఫర్లు. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై ఈ ఆఫర్లు, డిస్కౌంట్‌లను యాడ్ చేసి మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. సేల్ సమయంలో HDFC క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. దీనితో పాటు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. 

Also Read: ‘కాళీ’తో పాక్ పని ఖతం.. భారత్ దగ్గరున్న ఈ రహస్య ఆయుధం గురించి మీకు తెలుసా..?

ఉత్తమ 5 ల్యాప్‌టాప్‌లు

ASUS Vivobook 15 (Intel Core i3-1215U) మోడల్

ASUS Vivobook 15 మోడల్ ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే.. Amazonలో రూ. 54990కి లిస్ట్ అయింది. ఇప్పుడు ఈ సేల్‌లో భారీ తగ్గింపుతో కేవలం రూ. 32990కి లభిస్తుంది.

HP 15s (Intel Core i3-1215U) మోడల్

Amazon గ్రేట్ సమ్మర్ సేల్‌లో HP 15s మోడల్‌ను కొనుగోలు చేయాలనుకుంటే అదిరిపోయే డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇది Amazonలో రూ. 51134కి లిస్ట్ అయింది. ఇప్పుడు ఈ కొత్త సేల్‌లో భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 34990కి కొనుక్కోవచ్చు. 

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు.. వ్యాపిస్తున్న మంటలు.. ఆందోళనలో వేలాది మంది ప్రజలు

Dell Vostro (Intel Core i3-1215U) Model

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో డెల్ వోస్ట్రో మోడల్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 49198 ఉండగా.. ఈ సేల్‌ సమయంలో దీనిని రూ. 31990కి సొంతం చేసుకోవచ్చు.

Lenovo IdeaPad 3 (Intel Core i3-1215U) Model

Lenovo IdeaPad 3 మోడల్ ల్యాప్‌టాప్ కూడా భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. దీని అసలు ధర రూ. 55190 ఉండగా.. ఇప్పుడు ఈ సేల్ సమయంలో చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. భారీ తగ్గింపు తర్వాత దీనిని రూ. 32999కి కొనుక్కోని ఇంటికి పట్టికెళ్లొచ్చు. 

Also read : 12 ఏళ్లుగా పాకిస్తాన్‌కు గూఢచర్యం.. రాజస్థాన్‌లో దొరికిన ఇంటి దొంగ!

Acer Aspire Lite (AMD Ryzen 5-5625U) Model

Acer Aspire Lite మోడల్ ల్యాప్‌టాప్ విద్యార్థులకు మంచి ఆప్షన్. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025లో ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటే 44% తగ్గింపు లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఇది రూ. 32990 కు లభిస్తుంది.

tech-news | telugu tech news | tech-news-telugu | laptop offers | laptops | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు