/rtv/media/media_files/2025/05/02/MSRgFCo7xBabXjpJ9XA8.jpg)
Pakistan ISI Spying Rajasthan Pathan Khan Arrested
Pathan Khan: పాకిస్తాన్ ISI తరపున గూఢచర్యం చేస్తున్న రాజస్థాన్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పఠాన్ ఖాన్ 12ఏళ్లుగా భారత భద్రతకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్‌కు తరలిస్తున్నాడని అధికారులు తెలిపారు. బిఎస్‌ఎఫ్ సిబ్బంది కాపలా ఉన్న ప్రదేశంలో భూమికూడా ఉన్నట్లు గుర్తించారు.
2013 నుంచి మొదలు..
ఈ మేరకు పక్కా సమాచారంతో రాజస్థాన్ పోలీసు నిఘా విభాగం జైసల్మేర్‌కు చెందిన పఠాన్ ను అరెస్టు చేసింది. 2013 నుంచి భారతదేశ సరిహద్దు భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు తరలిస్తున్నాడని అధికారులు భావిస్తున్నారు. మార్చి 18న అతన్ని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా ప్రశ్నించిన తర్వాత గురువారం అధికారికంగా అరెస్టు చేసినట్లు నిఘా విభాగం డైరెక్టర్ జనరల్ సంజయ్ అగర్వాల్ తెలిపారు.
డబ్బు ఆశ చూపి..
పఠాన్ ఆపరేషన్ 2013లో పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు ప్రారంభమైందని అధికారులు చెబుతున్నారు. అప్పుడే ISI కార్యకర్తలు తమ మొదటి చర్య తీసుకున్నారని ఆరోపించారు. 'ఐఎస్ఐ అధికారులు అతన్ని డబ్బుతో కొనేశారు. తర్వాత అతనికి గూఢచర్య శిక్షణ ఇచ్చారు. అప్పటినుంచి అతను ఐఎస్ఐ నిర్వాహకులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నాడు. జైసల్మేర్ అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం నుంచి సున్నితమైన రహస్య సమాచారాన్ని పంపుతున్నాడని దర్యాప్తులో తేలిందని అగర్వాల్ చెప్పారు.
Also Read: Life Style: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
అన్నీ ఫేక్ ఐడీలు..
నకిలీ గుర్తింపు కార్డులు కలిగివున్నాడు. సోషల్ మీడియాలోనూ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాడు. మరొకరిపేరుమీద సిమ్ కార్డులు వాడుతున్నాడు. అతను రవి కిషన్ అనే స్థానిక రైతుగా పేరుమార్చుకున్నాడు. అలాగే అందిరితో పరిచయం పెంచుకున్నాడు. భారత్, పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న నూర్-కి -చక్కి గ్రామంలోని జీరో ఆర్‌డి ప్రాంతంలో వ్యవసాయ భూమిని కలిగి ఉన్నాడు. ఇది బిఎస్‌ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బంది కాపలాగా ఉన్న సున్నితమైన ప్రదేశం అని అధికారులు వెల్లడించారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఎలాంటి సమాచారం లీక్ చేశాడు?
BSF దళాల ఫోటోలు, వీడియోలు, వారి కార్యకలాపాలు, సరిహద్దు సమీపంలోని భద్రతా ఆపరేషన్స్ గురించి వివరాలను పంపించాడు. డేటా మొత్తం పరిశీలిస్తున్నాం. అతని నెట్‌వర్క్ ఎంత లోతుగా ఉందో పరిశీలిస్తున్నాం. దశాబ్దానికి పైగా జాతీయ భద్రతా ఉల్లంఘనలు ఏ విధంగా జరిగి ఉండవచ్చు అనే విషయాలను దర్యాప్తు అధికారులు గుర్తిస్తున్నారు. మరిన్ని అరెస్టులు కావొచ్చు. లింకులు బయటపడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పఠాన్ ఖాన్ కస్టడీలోనే ఉన్నాడని భద్రతా అధికారులు తెలిపారు.
rajastan spying