/rtv/media/media_files/2025/05/06/xRPLAxp4uNVaQ4ErpChj.jpg)
iQOO Neo 10 Smartphone
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ తన లైనప్‌లోని మరొక స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. iQOO Neo 10 పేరుతో కొత్త మొబైల్‌ను భారతదేశంలో రిలీజ్ చేయబోతుంది. ఈ ఫోన్ త్వరలో భారతదేశానికి వస్తుందని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. నియో 10 సిరీస్‌లో వస్తున్న ఈ ఫోన్ iQOO నియో 10R తర్వాతి ఎడిషన్ అవుతుంది . కాగా కంపెనీ ఇప్పటికే ఈ ఫోన్‌ను గత నవంబర్‌లో చైనాలో విడుదల చేసింది. ఇప్పుడు ఇది భారతదేశంలోకి రాబోతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read: ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!
iQOO Neo 10 Launch Date
iQOO Neo 10 ఫోన్ మే 18న భారతదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ అమెజాన్‌లో ఈ ఫోన్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ డ్యూయల్-టోన్ డిజైన్‌ను కలిగి ఉంది. దీనిలో ప్రకాశవంతమైన ఆరెంజ్ అండ్ వైట్ కలర్ మిక్సింగ్‌తో కనిపిస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా అందించబడింది. భారతదేశంలో ఈ ఫోన్ దాదాపు రూ.35000 ధరతో వచ్చే అవకాశం ఉంది.
Also Read: హైదరాబాద్ లేడీసా మజాకా.. బ్లౌజ్ ఆఫర్ చూడగానే పరుగో పరుగు - కిక్కిరిసిపోయిన షాప్
The #iQOONeo10 is almost here, and you get to experience it FIRST! Join us for exclusive Sneak Peek sessions in Mumbai and Madurai on 18th May. 📱🔥
— iQOO India (@IqooInd) May 6, 2025
Register Now and be among the first to get your hands on the Neo 10!
Thread link: https://t.co/AAzGEFHFyf
Form link:… pic.twitter.com/5XMcqgAdD0
iQOO Neo 10 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఫోన్‌లో డ్యూయల్ చిప్ ఉంటుంది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 12GB వరకు RAMను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్ OS తో రన్ అవుతుంది. ఇంకా ఈ ఫోన్ 6.78-అంగుళాల FHD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది AMOLED ప్యానెల్‌తో వస్తుందని అంచనా.
Also Read: గుండెపోటుకు అరటిపండుతో చెక్..రోజుకు 3 తినండి
ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 16 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీతో రానుంది.
Also Read: తల నరికి.. బీజేపీ మహిళా నేత దారుణ హత్య!
iqoo-new-phone | latest-telugu-news | telugu-news | 5g-mobiles