పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్య కోసం భారత సైన్యం పక్కా ప్లాన్‌తో రెడీగా ఉంది. దీంతో వార్ టెన్షన్‌లో పాకిస్తాన్ వణికిపోతుంది. మీడియా ముందు మేం వెనక్కి దగ్గబోము అని పాకిస్తాన్ వార్నింగ్ ఇస్తున్నా.. లోలోపట మాత్రం ఇండియన్ ఆర్మీ ఏం చేస్తోందో అని మన దాయది పాక్ భయపడుతుంది. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ ఎప్పుడు, ఏ రూపంలో చేస్తోందో అని ఆందోళనలో ఉంది. పాకిస్తాన్ మద్దతుదారులైన ఉగ్రవాద శిభిరాలను పీవోకేలో ఖాళీ చేయిస్తున్నది. టెర్రరిస్టులను కాపాడుకోవడం కోసం బంకర్లలోకి ఉగ్రవాదుల తరలిస్తున్నారు. టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లు ఖాళీగా మారుతున్నాయి. పీవోకేలోని కెల్, సర్జి, దుద్నియల్, అత్ముఖం, జురా, లిపా, పచ్ఛిబన్, పార్వార్డ్స్ కహుతా, కోట్లి, ఖుయురట్టా, మంధార్, నిఖైల్, చమన్‌కోట్‌ల నుంచి టెర్రరిస్టులు పారిపోతున్నారు.
ఇండియన్ ఆర్మీ దాదాపు 150 నుంచి 200 మంది టెర్రరిస్టులు ఆయా ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించింది. హిజ్బుల్ ముజాహిదీన్, జైషె మొహమ్మద్, లష్కరే తోయిబా సహా పీవోకేలో యాక్టీవ్‌గా 17 టెర్రర్ సంస్థలు ఉన్నట్లు భారత నిఘా వర్గాలు వెల్లడించాయి.
(india pak war | pakisthan | indian-army | indian army action | jammu kashmir attack | jammu kashmir terror news | latest-telugu-news)