/rtv/media/media_files/2025/01/08/LdAZN9CY3h235ikRGifO.jpg)
iphone 15 price drop
ఐఫోన్ కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. కానీ అధిక ధర వల్ల చాలా మంది తమ కోరికను చంపుకుంటున్నారు. ఎప్పుడైనా ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటే అప్పుడు కొనుక్కుందాంలే అని ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మీరు కూడా అలాంటి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. మీకో గుడ్ న్యూస్. ఇప్పుడు IPHONE 15ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఐఫోన్ 15ను అతి తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: ఖమ్మంలో అమానుషం.. మంత్రాల నెపంతో సొంత బాబాయినే హత్య చేసిన యువకుడు!
IPHONE 15 Price Drop
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15.. 128GB వేరియంట్ అసలు ధర రూ.69,900గా ఉంది. ఇప్పుడు 7 శాతం తగ్గింపుతో రూ.64,400కి లిస్ట్ అయింది. అంటే కస్టమర్లకు ఎలాంటి ఆఫర్ లేకుండానే రూ.5500 తగ్గింపు లభిస్తుంది. ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి.
Also Read: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
IPHONE 15 Bank Offers
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5% క్యాష్‌బ్యాక్ వస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 2000 డిస్కౌంట్ పొందొచ్చు.
స్పెషల్ డిస్కౌంట్ - క్యాష్‌బ్యాక్ లేదా కూపన్ ద్వారా రూ. 5500 తగ్గింపు లభిస్తుంది.
నో కాస్ట్ EMI ఆఫర్ ద్వారా నెలకు రూ. 10,734 ప్రారంభ వాయిదా అందుబాటులో ఉంది.
ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 3000 తగ్గింపు పొందొచ్చు.
కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 3000 తగ్గింపు లభిస్తుంది.
Also Read: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
ఈ తగ్గింపులతో Apple iPhone 15 బేస్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. దాదాపు రూ. 41,150 వరకు ఎక్స్ఛేంజ్ తగ్గింపు పొందొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ 15 కొనుగోలు చేస్తే రూ.41,150 వరకు ఈ తగ్గింపు లభిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. పాత ఫోన్ మోడల్, పెర్ఫామెన్స్ బట్టి ఈ ధరను నిర్ణయిస్తారు. కండీషన్ బాగోలేకపోతే మీ జేబులోంచి మరింత డబ్బు పెట్టాల్సి ఉంటుంది.
Also Read: చైనాకు ట్రంప్ భారీ షాక్..ఏకంగా 104 శాతం..
(telugu tech news | tech-news | latest-telugu-news | iphone-prices | iphone offers)