/rtv/media/media_files/2025/04/08/Zylhl2cM7GHgRG0JyTeW.jpg)
A young man murdered his own uncle
TG Crime : ఖమ్మంలో అమానుష ఘటన జరిగింది. భద్రాధ్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం జడ్ వీరభధ్రాపురంలో చేతబడి నెపంతో సొంత బాబాయినే కిరాతకంగా హత్య చేశాడు ఓ యువకుడు. తన బాబాయి కొమరం రాముడు చేతబడి చేయడం వల్లే తన ఇంట్లో వారు వరుసగా ఏదోకారణం చేత మృతిచెందుతున్నారని అనుమానం పెంచుకున్న కొమరం వెంకటేష్.. సొంత బాబాయి కొమరం రాముడిని హత్యచేసేసేందుకు పథకం రచించాడు. గత నెల 11వతేదీన భార్య కొమరం లక్ష్మీదేవితో కలసి కొమరం రాముడు అదే గ్రామంలోని బంధువుల పెళ్లికి వెళ్లాడు.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
పథకం ప్రకారం మద్యం ఆశచూపి కొమరం రాముడిని గ్రామ శివారులోని చెరువు కట్టకు రప్పించాడు కొమరం వెంకటేష్. మద్యం మత్తులో ఉన్న కొమరం రాముడిని తన బామ్మర్థి బద్దం బాలరాజు సాయంతో వైరుతో గొంతునులిమి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని గన్నీసంచిలో కూర్చి చెరువులో పడేశారు. అయితే పెళ్లికి తనతో వచ్చిన భర్త కనిపించకపోవడంతో అంతటా వెతికిన భార్యకు జాడ తెలియలేదు. దీంతో తన భర్త కనిపించడం లేదంటూ గత నెల 16వ తేదీన దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భార్య కొమరం లక్ష్మీదేవీ.
Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..
భార్య ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు, కేసు నమోదు చేసిన మూడు వారాల్లో దుమ్ముగూడెం సీఐ అశోక్ మిస్సింగ్ కేసు మిస్టరీని చేధించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో గ్రామస్థుల సాయంతో మృతుడు కొమరం రాముడి మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీయించారు. మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం భధ్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
Also read: BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’