Google Pixel 9 Price Drop: ఇదేక్కడి ఆఫర్ మచ్చా.. ఏకంగా రూ.12వేల భారీ డిస్కౌంట్ - మళ్లీ ఇలాంటిది రాదు!

ఫ్లిప్‌కార్ట్‌లో google pixel 9 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 12/256GB వేరియంట్ ధర రూ.79,999 ఉండగా.. ఇప్పుడు రూ.74,999కి లిస్ట్ అయింది. HDFC బ్యాంక్ కార్డ్‌పై రూ.7,000 తగ్గింపు పొందవచ్చు. మొత్తంగా రూ.12వేల వరకు తగ్గింపు లభిస్తుంది.

New Update
Google Pixel 9 Price Drop

Google Pixel 9 Price Drop

గూగుల్ పిక్సెల్ 9 (Google Pixel 9) ఫోన్ కొనుగోలుపై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్లాగ్‌షిప్ సేల్‌లో పిక్సెల్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్‌లను పొందొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన ధర, ఫీచర్లు, ఆఫర్ల గురించి తెలుసుకుందాం. 

Google Pixel 9 Offers

Google Pixel 9 ఫోన్‌లోని 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.79,999కి రిలీజ్ అయింది. ఇప్పుడు ఇది ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.74,999 కు లిస్ట్ అయింది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై రూ.7,000 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర రూ.67,999కు తగ్గుతుంది. అదే సమయంలో పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.50,150 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్.. ఫోన్ ప్రస్తుత స్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. మొత్తంగా ఈ ఫోన్ పై రూ.12,000 వరకు తగ్గింపు లభిస్తుందన్నమాట. 

Google Pixel 9 Specifications

గూగుల్ పిక్సెల్ 9 ఫోన్‌లో 6.3 -అంగుళాల యాక్టువా OLED డిస్ప్లే ఉంది. ఇది 60Hz-120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో టెన్సర్ G4 ప్రాసెసర్ అమర్చారు. ఆండ్రాయిడ్ 14 లో పనిచేస్తుంది. 

Also Read: కాల్పుల విరమణకు బ్రేక్.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ దాడులు

ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, Qi సర్టిఫైడ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా, 48-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 10.5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు