/rtv/media/media_files/2025/06/24/israel-says-iran-violates-ceasefire-announced-by-trump-2025-06-24-15-27-18.jpg)
Israel says Iran violates ceasefire announced by Trump, orders new strikes
పశ్చిమాసియాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే ఇరాన్ దీన్ని ఉల్లంఘించి తమపై మిసైల్స్‌తో దాడులు చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ దాడులకు తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగాక 2 గంటలకే తమ గగనతలం పైకి ఇరాన్ నుంచి బాలిస్టిక్ క్షిపణులు వచ్చినట్లు ఐడీఫ్ తెలిపింది.
Also Read: బిలావల్ భుట్టో బలుపు మాటలు.. ఇండియాని రెచ్చగొడుతున్న పాకిస్తాన్
ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్‌లు మోగాయని పేర్కొంది. అయితే ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చేదాక సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌కు గట్టిగా బదలివ్వాలని ఐడీఎఫ్‌ను ఆదేశించినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. టెహ్రాన్‌కు అతి కీలకమైన ప్రాంతాలే టార్గెట్‌గా దాడులు చేయాలని పేర్కొన్నారు. కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ.. ఇరాన్ నుంచి సైనిక ముప్పు ఉందని ఇజ్రాయెల్ రక్షణాధికారి ఈ దాడులు ముందు అన్నారు. ఈ క్రమంలోనే తమ సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: అమెరికాకు ఇక చుక్కలే.. దోమ సైజులో చైనా డ్రోన్.. వీడియో చూస్తే షాక్ అవుతారు!
ఇజ్రాయెల్ ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఇరాన్ కాల్పుల విరమణ పాటిస్తుందని.. ఆ తర్వాత ఇజ్రాయెల్ కూడా ప్రారంభిస్తుందని చెప్పారు. దీనివల్ల యుద్ధం ముగుస్తుందని చెప్పారు. అయితే ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదని చెబుతూనే తమ సైనిక కార్యకలాపాలు ముగిసినట్లు పేర్కొంది. ఆ తర్వాత కాల్పుల విమరణ అమల్లోకి వచ్చినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా దీనికి అంగీకరించినట్లు పేర్కొంది. కానీ ఈ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించడం సంచలనం రేపుతోంది.