/rtv/media/media_files/2024/12/08/geyser51.jpeg)
శీతాకాలం వచ్చేసింది. చాలా మంది చలితో గజగజ వణికిపోతున్నారు. ఉదయం లేచి చల్లని నీళ్లతో స్నానం చేయాలంటే భయపడుతున్నారు. దీంతో గ్యాస్ లేదా వాటర్ హీటర్, గీజర్(geyser-water) వంటివి ఉపయోగించి వేడి నీళ్లతో ఉపశమనం పొందుతున్నారు. అందుకే చాలా ఇళ్లలో వాటర్ గీజర్ల (Water Geyser) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. అయితే గీజర్ల వాడకంలో చిన్న పొరపాటు జరిగినా అది విద్యుత్ షాక్‌కు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి గీజర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
Also Read : పుట్టుమచ్చను చూసి క్యాన్సర్ పసిగట్టొచ్చు.. ఎలానో తెలుసా..?
Geyser Tips
చెకింగ్:సాధారణంగా చాలా మంది గీజర్ల(Geyser Offers)ను వేసవి కాలంలో ఉపయోగించరు. అలా యూజ్ చేయకుండా ఉంచిన గీజర్‌ను చలికాలం ప్రారంభానికి ముందు.. ఒకసారి ఎలక్ట్రీషియన్‌తో తనిఖీ చేయించాలి. వైరింగ్, ఎర్తింగ్, హీటింగ్ ఎలిమెంట్ సరిగా పనిచేస్తున్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి.
క్వాలిటీ చెకింగ్:కొత్తగా కొనుగోలు చేసే గీజర్ మంచి బ్రాండా కాదా అని చూసుకోవాలి. ఆటోమేటిక్ స్విచ్-ఆఫ్ (Auto Switch-Off) ఫీచర్ ఉన్న గీజర్లను వాడటం వల్ల నీరు ఎక్కువగా వేడెక్కకుండా ఉంటుంది.
సరైన వైరింగ్:ఒకవేళ కొత్త గీజర్ కొంటే దాని ఇన్‌స్టాలేషన్ కోసం ఉపయోగించే వైరింగ్ మంచి క్వాలిటీతో ఉండాలి. అలాగే ఎర్తింగ్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఎర్తింగ్ సరిగ్గా లేకపోతే షాక్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువ.
సరైన స్థానం:గీజర్‌ను నీటి చెమ్మ తగిలే ప్లేస్‌లో పెట్టకూడదు. అలా చేస్తే షాక్ కొట్టే ప్రమాదం ఉంది.
క్లీనింగ్: అప్పుడప్పుడు గీజర్‌ను క్లీన్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఒకవేళ క్లీన్ చేయకపోతే.. నీళ్లు నిళ్వ ఉండి
గీజర్ ఆఫ్ చేయడం:బాత్‌రూమ్‌లోకి అడుగుపెట్టే ముందు లేదా స్నానం చేసే ముందు తప్పకుండా గీజర్‌ను ఆఫ్ చేయాలి. వేడి నీటిని బకెట్‌లో తీసుకున్న తర్వాతే స్నానానికి ఉపయోగించడం సురక్షితం. ఆన్ చేసి ఉన్న గీజర్‌ను తాకడం లేదా స్నానం చేయడం అత్యంత ప్రమాదకరం.
సర్వీసింగ్: ఏసీలకు సర్వీసింగ్ చేయించినట్లే, ఎలక్ట్రిక్ గీజర్లకు కూడా ఏడాదికి కనీసం ఒక్కసారైనా సర్వీసింగ్ చేయించడం చాలా ముఖ్యం. సర్వీసింగ్‌లో వైరింగ్, ట్యాంక్ లీకేజీలు, సాకెట్ల స్థితిని తనిఖీ చేయిస్తారు. లీకేజీ ఉంటే కరెంటు నీటిలోకి ప్రవహించి షాక్‌కు కారణమవుతుంది. ఉప్పు నీరు వాడే ప్రాంతాల్లో సంవత్సరానికి రెండుసార్లు సర్వీస్ చేయించడం మంచిది.
Also Read : జనపనార గింజల్లో ఎన్నో పోషకాలు.. పోషకాహార నిపుణుల సలహా మీరూ తెలుసుకోండి
Follow Us