Flipkart Diwali Offer: దీపావళికి బెస్ట్ డీల్స్.. 7550mAh​ బ్యాటరీ.. 50MP కెమెరాతో కళ్లు చెదిరే ఫీచర్లతో మొబైల్స్!

పోకో F7 5G మోడల్ కూడా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. దీనికి 7,550mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, ప్రీమియం మెటల్, గ్లాస్ డిజైన్ కూడా ఉంది. 

New Update
Poco F7 5G

Poco F7 5G

ఫ్లిప్‌కార్ట్‌లో దీపావళి పండుగ సేల్ మొదలైంది. ఈ దీపావళికి ఎవరైనా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే మాత్రం.. ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. గతంలో బిగ్ బిలియన్ సేల్ వచ్చినప్పుడు ఎవరైతే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయలేకపోయారో.. వారు ఈ సేల్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. అన్ని మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. శాంసంగ్, ఐఫోన్, వన్ ప్లస్ ఇలా అన్ని కంపెనీల మొబైల్స్‌పై ఆఫర్లు ఉన్నాయి. దీనికి తోడు 7550 ఎంఏహెచ్​ బ్యాటరీ.. 50 ఎంపీ కెమెరా అదిరిపోయే ఫీచర్లతో మొబైల్స్ ఉన్నాయి. మరి ఆ పీచర్లతో ఉన్న కంపెనీ మొబైల్స్ ఏవో ఈ స్టోరీలో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Flipkart Diwali Offer: కేవలం రూ. 35 వేలకే ఐఫోన్ 16.. ఈ దీపావళికి ఇంతకు మించిన ఆఫర్ లేదు బ్రో!

గెలాక్సీ S24

శాంసంగ్ గెలాక్సీ S24 మోడల్‌ను ఇప్పుడు మెరుగైన చిప్‌సెట్‌తో అందిస్తున్నారు.దీని ఒరిజినల్ మోడల్‌లో ఎక్సీనోస్ 2400 చిప్‌సెట్ ఉండేది. కానీ ఇప్పుడు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వచ్చిన ఈ ఫోన్ పాత దాని కంటే బాగా పనిచేస్తుంది. ఈ మొబైల్128GB + 8GB ధర రూ. 39,999 గా ఉంది. బ్యాంకు ఆఫర్లు పెడితే ఇంకా తగ్గుతుంది.

పోకో F7 5G 
పోకో F7 5G మోడల్ కూడా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అన్ని కలుపుకుంటే రూ.30,999కు ఈ మొబైల్ వస్తుంది. దీనికి 7,550mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్, 50MP ప్రధాన కెమెరా, ప్రీమియం మెటల్, గ్లాస్ డిజైన్ కూడా ఉంది. 

నథింగ్ ఫోన్ 3
నథింగ్ ఫోన్ 3 కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎక్స్ఛేంజ్, బ్యాంక్ డిస్కౌంట్‌లు కలిపితే రూ.40 వేలకు మొబైల్ వస్తుంది. దీనికి ట్రిపుల్ కెమెరా సిస్టమ్, డిజైన్, క్లీన్ నథింగ్ OS యూఐ, స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తోంది.

CMF ఫోన్ 2 ప్రో 
తక్కువ ధరలోనే మంచి బెస్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మొబైల్ బేస్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. మీరు ఆఫర్లు అవి యాడ్ చేస్తే దీని ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ సేల్‌లో మీకు నచ్చిన మొబైల్ కొనుగోలు చేసేయండి. 

ఇది కూడా చూడండి: Flipkart Diwali Offer: ఇదెక్కడి ఆఫర్ రా మామా.. రూ.1.40 లక్షల స్మార్ట్ టీవీ కేవలం రూ.46 వేలకే ..!

Advertisment
తాజా కథనాలు