Flipkart Diwali Offer: కేవలం రూ. 35 వేలకే ఐఫోన్ 16.. ఈ దీపావళికి ఇంతకు మించిన ఆఫర్ లేదు బ్రో!

దీపావళి పండుగ సేల్‌లో ఐఫోన్ 16 పై మరోసారి గొప్ప డీల్ వచ్చింది. రూ.57,999 ఉన్న మొబైల్‌కి SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే.. అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. అలాగే పాత ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది.

New Update
iPhone 16

Iphone 16

ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి  ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అక్టోబర్ 24 వరకు ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ జరుగుతోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ ఐటెమ్స్‌పై భారీగా తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా ఐఫోన్‌లపై అయితే బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఈ పండుగ సేల్‌లో ఐఫోన్ 16 పై మరోసారి గొప్ప డీల్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ ఈ మోడల్‌పై రూ.34 వేల వరకు పూర్తి తగ్గింపు అందిస్తోంది. గతంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కూడా ఇలాంటి ఆఫరే లభించింది. కానీ అప్పుడు ఎక్కువ డిమాండ్ కారణంగా ఈ ఫోన్ కొద్ది గంటల్లోనే స్టాక్ అయిపోయింది. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి వినియోగదారులకు మరొక అవకాశం లభించింది.

20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌

ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 16 ధర రూ.69,900 కాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో ఈ ఫోన్ రూ.57,999 కి ఉంది. అయితే మీరు దీనికి SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ఉంటే, మీరు అదనంగా రూ.3వేలు తగ్గింపు పొందవచ్చు. దీనితో ఫోన్ ధర కేవలం రూ.54,999 కి తగ్గుతుంది. ఈ డీల్‌లో ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకో ప్లస్. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు పాత ఫోన్‌ను మార్పిడి చేసుకుంటే రూ. 20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా లభిస్తుంది. అయితే మీ పాత ఫోన్ కండిషన్ మంచిగా ఉంటే ఐఫోన్ 16ని కేవలం రూ. 34,999 కు మీరు  పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ విలువ అనేది మీ పాత ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. 

ఇది కూడా చూడండి: Diwali Amazon Offers: దీపావళికి అమెజాన్ పిచ్చెక్కించే ఆఫర్.. కేవలం రూ.500లకే కత్తిలాంటి ఇయర్ బడ్స్!

ఐఫోన్ 16 కేవలం ఆఫర్‌లతో పాటు ఫీచర్లు కూడా బాగా ఉన్నాయి. 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్ ఫీచర్ కూడా ఉంది. అలాగే కెమెరా వెనుకవైపు 48MP ప్రైమరీ, 12MP సెకండరీ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 12MP ఉంది. A18 బయోనిక్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది మెరుగైన పనితీరు, కొత్త AI-ఆధారిత సామర్థ్యాలను అందిస్తుంది. ఈ ఫోన్‌లో కొత్త యాక్షన్ బటన్, ప్రత్యేక కెమెరా బటన్ కూడా ఉన్నాయి. ఇవి ఫోటోగ్రఫీ, ఫోన్ నియంత్రణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. మీకు ఐఫోన్ కావాలంటే ఈ సేల్‌లో రూ.35 వేలకే కొనుగోల చేసేయండి. ఆలస్యం చేస్తే మీరు డీల్‌ను కోల్పోయే అవకాశం ఉంది. 

ఇది కూడా చూడండి: Samsung Galaxy M17 5G: బడ్జెట్ ధరలో శాంసంగ్ గ్యాలెక్సీ మొబైల్.. కెమెరా, స్టోరేజ్‌తో పిచ్చెక్కిస్తున్న ఫీచర్లు

Advertisment
తాజా కథనాలు