/rtv/media/media_files/2025/10/11/diwali-amazon-offers-2025-10-11-16-07-00.jpg)
Diwali Amazon Offers
Flipkart Diwali Offer: పండగ సీజన్ వచ్చిందంటే ఫ్లిప్ కార్ట్(flipkart), అమెజాన్(amazon) వంటి ఆన్ లైన్ ఫ్లాట్ ఫార్మ్ లలో ఆఫర్ల జాతర మొదలవుతుంది. ఇప్పుడు దీపావళి పండగ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 75 ఇంచెస్ 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ(75 Inch Google Smart TV)ల పై రూ. 1లక్ష వరకు డిస్కౌంట్ లభిస్తోంది. బిగ్ దీపావళి సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్ లో మంచి టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఆఫర్ వివరాలు ఈఎమ్ఐ డీల్స్ కి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...
75 ఇంచెస్ గూగుల్ స్మార్ట్ టీవీ
యూ75 మోడల్, 75 ఇంచెస్, విత్ అల్ట్రా హెచ్ డీ 4కే ఎల్ఈడీ గూగుల్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 49,999 కే అందుబాటులో ఉంది. దీని ధర రూ .1,39,999 ఉండగా.. 64 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, AIPQ ప్రో ప్రాసెసర్, 30W డాల్బీ విజన్ అట్మోస్ వంటి బెస్ట్ ఫీచర్స్ ను కలిగి ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ అప్షన్స్ కూడా ఇందులో ఉన్నాయి.
అయితే ఈఎమ్ఐ, క్రెడిట్ కార్డు ఆప్షన్ల ద్వారా దీనిని మరింత తక్కువ ధరకు పొందవచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 3000 తగ్గింపు లభిస్తుంది. అంటే కేవలం రూ. 46,650 కే మీరు ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు. ఇంత తక్కువ ధరకే 75 ఇంచెన్స్ గూగుల్ స్మార్ట్ టీవీ పొందడం బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. టీవీలో గూగుల్ ఫీచర్ ఉండడం చేత మొబైల్ ఫోన్ వచ్చే అన్నీ ఆప్షన్ ను టీవీలో కూడా ఎంజాయ్ చేయవచ్చు. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్, హాట్ స్టార్ ఇలా అన్ని ఓటీటీల కంటెంట్ టీవీలో చూడవచ్చు. దీని కోసం మీకు సబ్ స్క్రిప్షన్ ఉంటే సరిపోతుంది.
నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్
నెట్ అమౌంట్ కట్టే పరిస్థితి లేని వారి కోసం నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఎటువంటి వడ్డీ లేకుండా 9 లేదా 6 నెలల వాయిదాల్లో డబ్బు చెల్లించి సులభంగా టీవీ కొనుగోలు చేయవచ్చు. 9 నెలల ఈఎంఐ ఆప్షన్ తీసుకుంటే .. నెలకు రూ. రూ.5,556 చెల్లించాల్సి ఉంటుంది. 6 నెలల ఆప్షన్ తీసుకుంటే.. నెలకు రూ. రూ.8,334 చెల్లించాల్సి ఉంటుంది.
రెగ్యులర్ ఈఎంఐ
రెగ్యులర్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. 36 నెలల వాయిదా తీసుకుంటే.. నెలకు రూ.. 1,758 చెల్లించాలి. అలాగే 24 నెలలకు రూ. 2,449, 18 నెలలకు రూ.3,143 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరం పాటు 12 నెలల ఈఎంఐ తీసుకుంటే.. నెలకు.. రూ. 4,537 చెల్లించాలి.