Flipkart Mobile Offers: రచ్చ రంబోలా.. Samsung ఫోన్‌పై రూ.13వేల భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌ కొత్త సేల్‌ అదిరింది..!

ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ35 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. రూ.30,999కి లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు రూ.17,999కి లిస్ట్ అయింది. అలాగే బ్యాంక్ ఆఫర్ రూ.750 పొందొచ్చు. దీని తర్వాత రూ.17,249కి లభిస్తుంది.

New Update
Flipkart Big Festive Dhamaka sale Samsung Galaxy A35 5G mobile offer

Flipkart Big Festive Dhamaka sale Samsung Galaxy A35 5G mobile offer

దివాళీ పండుగ కోసం Flipkart Big Festive Dhamaka సేల్ ప్రారంభమైంది. ఈ సేల్ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్‌(Flipkart Mobile Offers) లను అందిస్తుంది. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ సేల్‌లో Samsung Galaxy A35 5G ఒక మంచి అవకాశం. దీనిని ఇ-కామర్స్ సైట్‌లో భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. Samsung Galaxy A35 5G గణనీయమైన ధర తగ్గింపులను పొందింది. అలాగే బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌పై భారీ తగ్గింపులను కూడా పొందవచ్చు. Samsung Galaxy A35 5Gపై అందుబాటులో ఉన్న డీల్స్, ఆఫర్‌లను గురించి తెలుసుకుందాం. 

Also Read :  మోటో కొత్త వేరియంట్ అదిరింది.. లుక్, డిజైన్ వేరె లెవెల్ మచ్చా..!

Samsung Galaxy A35 5G Price

Samsung Galaxy A35 5G మొబైల్ 8GB/128GB స్టోరేజ్ వేరియంట్ మార్చి 2024లో రూ.30,999కి ప్రారంభించబడింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.17,999 కి జాబితా చేయబడింది. బ్యాంక్ ఆఫర్ విషయానికొస్తే.. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ ట్రాన్షక్షన్లపై 5% క్యాష్‌బ్యాక్ (రూ.750) పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర రూ.17,249 అవుతుంది. ఇది రూ.13,750 తక్కువతో అందుబాటులోకి వస్తుంది. మరోవైపు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇవ్వడం వల్ల రూ.13,640 ఆదా చేయవచ్చు. అయితే ఇంత మొత్తంలో ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ మోడల్, ప్రస్తుత స్థితిపై ఆధారపడి ఉంటుంది.

Also Read :  ప్రపంచంలోనే అత్యంత 5 చిన్న ఫోన్లు.. అగ్గిపెట్టె కంటే వెరీ స్మాల్..!

Samsung Galaxy A35 5G Specs

Samsung Galaxy A35 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 1080x2408 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1,000 నిట్‌ల వరకు గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. Samsung Galaxy A35 5G స్మార్ట్‌ఫోన్ Exynos 1380 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15పై నడుస్తుంది. Samsung Galaxy A35 5G ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. ఇది సెల్ఫీల కోసం 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. ఇది దుమ్ము, వాటర్ రెసిస్టెన్సీ కోసం IP67 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది.

Advertisment
తాజా కథనాలు