New Smartphone: మోటో కొత్త వేరియంట్ అదిరింది.. లుక్, డిజైన్ వేరె లెవెల్ మచ్చా..!

మోటోరోలా తమ బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ Moto G35 5Gలో కొత్త 8GB RAM వేరియంట్‌ను భారతదేశంలో విడుదల చేసింది. 128GB స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ. 11,999. ఇది నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది.

New Update
Moto G35 5G New Variant

Moto G35 5G New Variant


మోటరోలా తన బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ Moto G35 5Gలోని కొత్త వేరియంట్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ 8GB RAMతో భారతదేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇది మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది. కొత్త మోడల్ త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు Moto G35 5G పూర్తి ధర, స్పెసిఫికేషన్‌ వివరాలు తెలుసుకుందాం. 

Moto G35 5G New Variant

మోటరోలా భారతదేశంలో విడుదల చేసిన Moto G35 5G కొత్త వేరియంట్ ధర విషయానికొస్తే..  8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ ఇవాళ (అక్టోబర్ 6) మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో Moto G35 5G.. 4GB/128GB వేరియంట్ అందుబాటులో ఉంది. దీని ధర రూ.8,999గా ఉంది. ఇది లాంచ్ సమయంలో రూ.9,999 ధరను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అందులో లీఫ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, గువా రెడ్ ఉన్నాయి. 

Moto G35 5G Specs

Moto G35 5G స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది వీడియోలు, గేమ్‌లు చక్కగా చూడటానికి 6.72-అంగుళాల FHD+ LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. 1000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది. HDR10 మద్దతు ఇస్తుంది. యూనిసోక్ T760 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఇది మధ్యస్థ-శ్రేణి ప్రాసెసర్ అయినప్పటికీ.. సోషల్ మీడియా, కాలింగ్, బ్రౌజింగ్, లైట్ గేమింగ్ వంటి రోజువారీ పనులను సులభంగా నిర్వహిస్తుంది. Moto G35 5G మొబైల్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒక రోజు పూర్తి బ్యాకప్‌ను అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. Moto G35 5G 50MP ప్రైమరీ లెన్స్ , 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరాతో వస్తుంది. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 16MP కెమెరాను కలిగి ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. డాల్బీ అట్మాస్‌తో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. Moto G35 5G డ్యూయల్ స్పీకర్లతో 3D సౌండ్ అనుభవం అందిస్తుంది. ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP52 రేటింగ్‌తో వస్తుంది. 

Advertisment
తాజా కథనాలు