/rtv/media/media_files/2025/10/05/worlds-smallest-mobile-phones-1-2025-10-05-20-36-08.jpg)
Worlds Smallest Mobile Phones
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పెద్ద పెద్ద స్క్రీన్‌లు, అధిక పనితీరు కలిగిన మొబైల్స్‌ను విడుదల చేస్తూ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇంకొన్ని కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లంటూ రెండు పెద్ద డిస్ప్లేలతో ఫోన్లను మార్కెట్‌లో తీసుకొస్తున్నాయి. అదే సమయంలో కొన్ని బ్రాండ్‌లు అత్యంత చిన్న ఫోన్లను రిలీజ్ చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ ఫోన్లు చిన్న సైజులో ఉండటమే కాకుండా.. వాటి డిజైన్, లుక్ పరంగా కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కొన్ని ఫోన్లను చూస్తే అగ్గిపెట్టె కంటే చాలా చిన్నగా ఉన్నాయి. అవి ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్లుగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
Worlds Smallest Mobile Phones
Zanco Tiny T1
Janko Tiny T1 ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న ఫంక్షనల్ మొబైల్‌గా ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం 46.7mm పొడవు, 13mm వెడల్పుతో వస్తుంది. దీని బరువు కేవలం 13 గ్రాములు ఉంటుంది. ఈ Janko Tiny T1 ఫోన్ 2G నెట్‌వర్క్‌లో పనిచేస్తుంది. 0.49 అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ అగ్గిపెట్టె కంటే చిన్నదిగా ఉంటుంది.
Posh Micro X S240
Posh Micro X S240 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను కలిగి ఉంది. కానీ ఇది కాంపాక్ట్ సైజులోనే ఉంటుంది. దీని స్క్రీన్ 2.4 అంగుళాలుగా ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది 2MP వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అదే సమయంలో 650mAh బ్యాటరీతో వస్తుంది. ఈ Posh Micro X S240 ఫోన్ చాలా చిన్నది. కాబట్టి ఇది పర్సు లేదా జేబులో సులభంగా దాచుకోవచ్చు.
Mini phone BM70
చాలా మంది ప్రయాణాలలో లేదా జాగింగ్ చేస్తున్నప్పుడు బరువైన ఫోన్‌ను తీసుకెళ్లి ఇబ్బందిపడుతుంటారు. అలాంటి వారికి ఈ మినీఫోన్ బాగా యూజ్ అవుతుంది. ఈ Mini phone BM70 బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయవచ్చు. ఇది కాల్స్ చేయడానికి, మ్యూజిక్ వినడానికి, మెసేజ్‌లను చదవడానికి ఉపయోగపడుతుంది.
Melrose S9
మెల్రోస్ నుండి వచ్చిన ఈ మోడల్ కాంపాక్ట్‌గా ఉండటమే కాకుండా డిజైన్ పరంగా ప్రీమియం లుక్‌తో వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది. ఇది 2.4 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ముందు, వెనుక కెమెరాలు ఉన్నాయి. ఈ ఫోన్ 3G మద్దతుతో వస్తుంది. ఈ మినీ ఆండ్రాయిడ్ ఫోన్ ప్రత్యేకమైన డిజైన్, పోర్టబిలిటీ కారణంగా ప్రసిద్ధి చెందింది.
Servo BM10
సర్వో BM10 ఫోన్ డిజైన్ పరంగా నోకియా 3310 ని పోలి ఉంటుంది. కానీ సైజ్ పరంగా చాలా చిన్నది. ఇది 350mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తుంది. డ్యూయల్ సిమ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. బ్లూటూత్ డయలర్‌గా కూడా పనిచేస్తుంది. దీని రెట్రో డిజైన్ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది.