/rtv/media/media_files/2025/10/03/flipkart-big-festive-dhamaka-sale-google-pixel-9-mobile-offer-2025-10-03-14-25-13.jpg)
Flipkart Big Festive Dhamaka sale Google Pixel 9 mobile offer
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్ ఇటీవల ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ను తీసుకొచ్చింది. దసరా పండుగ సందర్భంగా వచ్చిన ఈ సేల్ దాదాపు వారం రోజులు నడిచింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌టీవీలు, స్మార్ట్ వాచ్‌లు.. సహా మరెన్నో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అప్లయెన్సెస్‌లపై భారీ డిస్కౌంట్‌లు అందించి కస్టమర్లను ఆకట్టుకుంది. ఈ సేల్ రీసెంట్‌గా ముగిసింది. దీంతో ప్రొడెక్టుల ధరలన్నీ మళ్లీ మామూలు స్థితికి వచ్చాయి.
Flipkart Big Festive Dhamaka Sale
ఇప్పుడు ఏం కొనాలన్నా కాస్త ఎక్కువ మొత్తంలోనే డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఫ్లిప్‌కార్ట్ మరో అద్భుతమైన సేల్‌ను ప్రకటించింది. తాజాగా Flipkart Big Festive Dhamaka సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అందువల్ల ఈ సేల్‌లో మీరు భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే Google Pixel 9 Offers సరైన ఆప్షన్.
Google Pixel 9 కొనాలని ప్లాన్ చేస్తుంటే, భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ధర తగ్గింపులతో పాటు బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు Google Pixel 9లో అందుబాటులో ఉన్న డిస్కౌంట్లు, ఆఫర్‌ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Also Read: మళ్ళీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 229 పాయింట్లు పతనం
Google Pixel 9 Price
Google Pixel 9లోని 12GB/256GB స్టోరేజ్ వేరియంట్ గత సంవత్సరం ఆగస్టులో రూ.79,999కి లాంచ్ అయింది. ఇప్పుడు ఇది ఫ్లిప్‌కార్ట్‌లో రూ.54,999కు అందుబాటులో ఉంది. అంటే దాదాపు రూ.25000 భారీ తగ్గింపు లభిస్తోందన్నమాట. అలాగే బ్యాంక్ ఆఫర్లలో భాగంగా.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 5% క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత దీని ధర రూ.54,249 కు వస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా రూ.39,640 వరకు తగ్గించుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ చేయాలనుకున్న మొబైల్ మోడల్, పనితీరుబట్టి దాని ధరను నిర్ణయిస్తారు. ఈ తగ్గింపుతో Google Pixel 9 ను మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
Also Read : గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్.. మళ్లీ లేఆఫ్‌లు
Google Pixel 9 Specs
Google Pixel 9 మొబైల్ 6.3-అంగుళాల యాక్టువా OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1080x2424 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60Hz-120Hz రిఫ్రెష్ రేట్, 2,700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది. Wi-Fi 6, బ్లూటూత్ 5.3, GPS, డ్యూయల్-బ్యాండ్ GNSS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. డిస్ప్లే సేఫ్టీ కోసం ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా రక్షించబడుతుంది. భద్రత కోసం Google Pixel 9 ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.
కెమెరా సెటప్ విషయానికొస్తే Google Pixel 9లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, వెనుక భాగంలో 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. Google Pixel 9 స్మార్ట్‌ఫోన్ దుమ్ము, నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే Qi-సర్టిఫైడ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.