/rtv/media/media_files/2025/10/02/google-layoffs-over-100-design-jobs-cut-in-ai-shift-2025-10-02-17-42-29.jpg)
Google layoffs Over 100 design jobs cut in AI shift
ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. క్లౌడ్ విభాగంలోని డిజైన్ సంబంధిత రంగాల్లో పనిచేసే 100 మందిని ఈ వారం తొలగించింది. వీళ్లలో క్వాంటిటేటివ్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ రీసెర్చి టీమ్, ప్లాట్‌ఫామ్ అండ్ సర్వీస్ ఎక్స్‌పీరియన్స్ బృందంలో సభ్యులు ఎక్కువగా ఉన్నారు. వీళ్లందరూ కూడా వినియోగదారుల తీరును డేటా, సర్వేలు, రీసెర్చి ఆధారంగా విశ్లేషించే విభాగాల్లో పనిచేసేవారే.
Also Read: క్యాప్సికం పంటతో లాభాల వరద.. ఏడాదికి కోట్లు సంపాదిస్తున్న 25ఏళ్ల యువతి
వీళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే గూగుల్ ప్రొడక్ట్‌లను డిజైన్ చేస్తుంది. అంతేకాదు కొన్ని రకాల క్లౌడ్ డిజైన్ బృందాలను కూడా సగానికి పైగా తొలగించినట్లు సమాచారం. అయితే తాజాగా గూగుల్‌లో ఉద్యోగాలు పోయినవాళ్లలో ఎక్కువగా అమెరికాకు చెందినవారే ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గూగుల్ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగానే తాజాగా ఉద్యోగాలు తొలగించారు.
Also Read: ఆపిల్ ఐఫోన్, ఐపాడ్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?
సెప్టెంబర్‌లో జెమినీ, ఏఐ ఓవర్ వ్యూ విభాగాల్లో పనిచేస్తున్న వాళ్లలో 200 మందికి పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులకు గూగుల్ లేఆఫ్స్ ఇచ్చింది. దీంతో ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులు.. ఉద్యోగ భద్రత, తక్కువ జీతం వంటివాటిపై ఆందోళన చెందుతున్నారు. కొందరు ఉద్యోగులు వారు పనిచేసే విధానంపై మేనేజ్‌మెంట్‌ను ప్రశ్నించినందుకే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఇక 2025 ప్రారంభంలో కూడా క్లౌడ్ విభాగంలో పనిచేసే సిబ్బందిని గూగుల్ తొలగించింది. తమ బిజినెస్‌కు కీలక విభాగాలపై మాత్రమే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నట్లు అప్పట్లో గూగుల్ ప్రకటన చేసింది. అంతేకాదు గ్లోబల్ బిజినెస్, ప్లాట్‌ఫామ్స్ అండ్ డివైజెస్ డివిజన్‌లో కూడా తమ సిబ్బందిలో కొందరిని తొలగించింది. అలాగే హెచ్‌ఆర్ విభాగం, హార్డ్‌వేర్, సెర్చ్, యాడ్స్, ఫైనాన్స్, మార్కెటింగ్, కామర్స్ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి వాలంటరీ ఎగ్జిట్ ప్యాకెజీని ప్రకటించింది గూగుల్.
Also Read: ఎంతకు తెగించార్రా.. నకిలీ QR కోడ్ స్కామ్..పెట్రోల్ బంకులే టార్గెట్ !