Stock Market: మళ్ళీ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 229 పాయింట్లు పతనం

గాంధీ జయంతి సెలవు తర్వాత శుక్రవారం మొదలైన స్టాక్ మార్కెట్ శుక్రవారం కుప్పకూలిపోయింది. ప్రారంభం నుంచే నష్టాల్లో పయనిస్తోంది. సెన్సెక్స్ 229 పాయింట్లు తగ్గి 80,770 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లు తగ్గి 24,780 వద్ద ఉంది. 

New Update
stock market losses

బుధవారం లాభాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ ఒక రోజు సెలవు తర్వాత శుక్రవారం నాడు మాత్రం నేల చూపులు చూస్తోంది. సెన్సెక్స్ 229 పాయింట్లు తగ్గి 80,770 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లు తగ్గి 24,780 వద్ద ఉంది. ఉదయం ప్రారంభం దగ్గర నుంచీ BSE సెన్సెక్స్ 97.51 పాయింట్లు  పతనంతో 80,881 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 64.40 పాయింట్లు పతనంతో 24771.90గా ఉంది. 30 సెన్సెక్స్ స్టాక్లలో 17 నష్టఆ్లో ఉండగా.. 13 లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, BEL లు లాభాల్లో ఉన్నాయి.   బజాజ్ ఫైనాన్స్, M&M, మారుతి స్టాక్ లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ మిశ్రమంగా...

ప్రపంచ మార్కెట్ కూడా ఏమీ అంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 1.5% పెరిగి 45,584.54 వద్ద, కొరియా కోస్పి 2.70% పెరిగి 3,549.21 వద్ద ముగిశాయి. హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ ఇండెక్స్ 0.94% తగ్గి 27,030.33 వద్ద, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.52% పెరిగి 3,882.78 వద్ద ముగిసింది.
ఇక అక్టోబర్ 2న అమెరికాకు చెందిన డౌ జోన్స్ 0.17% పెరిగి 46,519.72 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.39%  S&P 500 0.062% లాభపడ్డాయి. అక్టోబర్ 1న విదేశీ పెట్టుబడిదారులు నగదు విభాగంలో రూ.1,605.20 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. దేశీయ పెట్టుబడిదారులు రూ.2,916.14 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు.

Advertisment
తాజా కథనాలు