/rtv/media/media_files/2025/09/02/flipkart-big-billion-days-sale-2025-2025-09-02-15-29-50.jpg)
Flipkart Big Billion Days Sale 2025
Flipkart Big Billion Days Sale 2025: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తరచూ వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు సంస్థ కొత్త కొత్త సేల్‌ను కస్టమర్లకు అందిస్తూ వస్తోంది. ఇప్పుడు మరొక భారీ సేల్‌ను తీసుకురాబోతుంది. త్వరలో Flipkart Big Billion Days Sale 2025 ప్రారంభించబోతుంది. గత ఏడాది ఈ సేల్ సెప్టెంబర్ 27న ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది మాత్రం కొంచెం ముందుగానే ప్రారంభం అవుతుందని సమాచారం.
Also Read:కవితకు షాక్.. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
Flipkart Big Billion Days Sale 2025
అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ Flipkart Big Billion Days 2025 Sale ఈ నెల అంటే సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సెప్టెంబర్ 30 వరకు అంటే దాదాపు వారం రోజులు కొనసాగనున్నట్లు సమాచారం. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 22న సేల్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది. ఈ తేదీలకు సంబంధించి పూర్తి అధికారిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అన్ని రకాల ప్రొడెక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్, శామ్‌సంగ్ గెలాక్సీ S24 వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లపై బంపర్ డిస్కౌంట్లు అందించే అవకాశం ఉంది. దీనితో పాటు రియల్‌మీ, పోకో, మోటరోలా, గూగుల్ పిక్సెల్ వంటి ఫోన్‌లపై 50% వరకు డిస్కౌంట్లు పొందే ఛాన్స్ కనిపిస్తోంది.
✅ Official : Flipkart Big Billion Day teaser is out 😍
— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) August 29, 2025
The sale will start from 3rd week of September !
Expected date : either 14/15th OR 20/21st September
Be ready for lots of Fake Sales & Out of stock products 😂😂😂 pic.twitter.com/Ugq1NOktYc
Also Read:ముఖ్య అతిథులుగా ముస్లింలు.. 35 ఏళ్ల తర్వాత పురాతన ఆలయాన్ని తెరిచిన కశ్మీరీ పండితులు
అలాగే పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఎక్స్‌ట్రా డిస్కౌంట్లు పొందవచ్చు. ఇంకా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10% తక్షణ డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. అదే సమయంలో నో-కాస్ట్ EMI కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఈసారి ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందించడానికి సన్నాహాలు చేస్తోంది.
Also Read: నన్నెవరేం పీకలేరు..బ్రొంకో టెస్ట్ లో రోహిత్ పాస్
ఫ్లిప్‌కార్ట్ యాప్‌లోని టీజర్‌లో.. ఐఫోన్ 16 సిరీస్, శామ్‌సంగ్ గెలాక్సీ S24 వంటి కొత్త ఫ్లాగ్‌షిప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు తెలిపింది. అలాగే మోటరోలా ఎడ్జ్ 60 ప్రోను కూడా భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. అయితే ఒక్క స్మార్ట్‌ఫోన్‌లు మాత్రమే కాకుండా.. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు, టాబ్లెట్‌లు, కెమెరాలపై 80% వరకు డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా డెల్, హెచ్‌పీ, లెనోవో, నథింగ్, సోనీ, బోస్ వంటి బ్రాండ్ల ఉత్పత్తులు తక్కువ ధరలకే లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇంకా స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఓవెన్‌లపై 75% వరకు డిస్కౌంట్లు లభిస్తాయని చూస్తున్నారు.
Samsung Galaxy Book 4 వంటి ల్యాప్‌టాప్‌లు రూ. 40,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. అలాగే OnePlus Buds 3 కూడా డిస్కౌంట్ పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లు, TWS ఇయర్‌బడ్‌లతో పాటు, వినియోగదారులు Intel PCలు, 55-అంగుళాల స్మార్ట్ టీవీలు, ఫ్రంట్-లోడింగ్ వాషింగ్ మెషీన్‌లపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు పొందవచ్చు.