/rtv/media/media_files/2025/09/02/brs-party-suspends-mlc-kavita-2025-09-02-14-38-36.jpg)
BRS Party Suspends MLC Kavita
ఎమ్మె్ల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ అధికారికంగా ప్రకటించింది. కవిత తీరు పార్టీకి నష్టం కలిగించేలా ఉందని పేర్కొంది. సోమవారం కాళేశ్వర ప్రాజెక్టు వ్యవహారంలో ఆమె మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసింది. ఈ ప్రాజెక్టులో కేసీఆర్‌కు అవినీతి మరక అంటించింది హరీశ్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి అంటూ విమర్శించారు. దీంతో కవితపై పార్టీ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: గణేష్ నిమజ్జనం లో రెచ్చిపోయిన పోలీసులు.. పిడిగుద్దులు గుద్దుతూ
పార్టీ MLC శ్రీమతి కె. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది.
— BRS Party (@BRSparty) September 2, 2025
పార్టీ అధ్యక్షులు శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె.… pic.twitter.com/iTSWON3irq
'' కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నాయి. అందుకే ఈ విషయాన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖర్ రావు.. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారని'' బీఆర్‌ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read: కేసు కొట్టివేయాలని హైకోర్టులో సీఎం రేవంత్, కేటీఆర్ పిటిషన్
కవిత పార్టీ నుంచి సస్పెండ్ కావడంతో ఆమె తర్వాతి ప్లాన్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది. మొత్తానికి ఆమె కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జాగృతి సంస్థ పేరుతోనే పార్టీ పెట్టనున్నట్లు కొందరు చెబుతున్నారు. బీసీల అంశమే ప్రధాన ఏజెండాగా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (TBRS) పేరును కూడా తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అలాగా బీఆర్‌ఎస్ పాత పార్టీ అయిన.. టీఆర్‌ఎస్ పేరను కూడా ఖరారు చేసే అవకాశాలున్నాయని మరికొందరు చెబుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది.