Rajasthan: షాకింగ్ వీడియో: ఊరేగింపులో పాములతో డ్యాన్సులు.. చివరికి..!

రాజస్థాన్‌లో జరిగే గోగాజీ మేళాలో, తేజా దశమి సందర్భంగా వేలాది భక్తులు పాములతో నాట్యం చేస్తారు. ఇది గోగాజీ మహారాజుపై వారికి ఉన్న భక్తి, అక్కడి స్థానిక సంప్రదాయం. భయం కన్నా భక్తికి ప్రాధాన్యం ఇచ్చే ఈ ఆచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

New Update
Dancing With Snakes Viral Video

Dancing With Snakes Viral Video

Rajasthan: రాజస్థాన్‌ రాష్ట్రంలో ప్రజల ప్రాచీన నమ్మకాలు, ఆచారాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అక్కడి ప్రజలు ప్రతి ఏడాది గోగాజీ మహారాజు జయంతిని తేజ దశమి రోజున ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జరిగే గోగాజీ మేళా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ మేళాలో వేలాది మంది భక్తులు పాల్గొని అరుదైన సంప్రదాయాన్ని పాటిస్తుంటారు. బ్రతికున్న పాములను చేతిలో పట్టుకుని నాట్యం చేస్తారు.

Dancing With Snakes Viral Video

Also Read: కూతురి ఇంజినీరింగ్‌ ఫీజు కోసం.. తల్లి దొంగతనం

తేజ దశమి సందర్భంగా ప్రత్యేక ఉత్సవం

తేజ దశమి రోజున గోగాజీ మేళా నిర్వహిస్తారు. ఈ రోజును స్థానికులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. గోగాజీ మహారాజు స్థానిక లోకదైవంగా పూజిస్తారు. ఆయన్ని నాగదేవతల రూపంగా కూడా కొందరు భావిస్తారు, అందుకే పామును ఈ ఉత్సవంలో లో చేతిలో పట్టుకుని డ్యాన్సులు చేస్తుంటారు.

పాములతో నాట్యం..  వీడియో వైరల్

అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో, పాములను చేతిలో పట్టుకుని భక్తులు ఉత్సాహంగా నాట్యం చేస్తూ కనిపించారు. ఇది సోషల్ మీడియా చూసి అందరూ ఆశ్చర్యాపోతున్నారు. ఈ ఆచారం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుండటంతో, స్థానికులకైతే ఇది సాధారణమే. భయం లేకుండా పాములతో కలిసే భక్తులు నృత్యం చేస్తూ, గోగాజీ మహారాజుకు తమ భక్తిని చాటుకుంటారు.

Also Read: Crime news: కసాయి పనికి ఒడిగట్టిన కన్న తండ్రి.. ముగ్గురు పిల్లల్ని చంపి తాను కూడా చివరికి..

ఈ మేళాకు రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరవుతారు. బ్రతికున్న పాములతో డ్యాన్సులు చేయడం అనేది ఈ మేళాకి ప్రత్యేక ఆకర్షణ. ఆధ్యాత్మికత, సాహసం, సంప్రదాయాల కలయికతో ఈ వేడుక సాగుతుంది.

పాములతో నాట్యం చేయడం అనేది చాలా మందికి భయంగా అనిపించొచ్చు. కానీ, గోగాజీ మహారాజుపై భక్తి ఉన్న వారు మాత్రం దీన్ని గొప్పగా పూజిస్తారు. పాము కాటేస్తే ప్రాణానికే ప్రమాదం అనే భయం కన్నా, దేవుడిపై నమ్మకం వారికి ఎక్కువ. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఈ వింత సంప్రదాయం వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరాలవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు