/rtv/media/media_files/2025/07/09/bengaluru-man-kills-wife-2025-07-09-20-51-12.jpg)
Bengaluru Man Kills Wife
భార్యభర్తలకు మధ్య చిన్నచిన్న గొడవలు సర్వసాధారణం. ఇద్దరిలో ఎవరో ఒకరు సర్ధుకుపోతే..ఆ గొడవ అంతటితో సమసిపోతుంది. కానీ, ఇటీవల కాలంలో ఎవరూ వెనక్కు తగ్గటం లేదు. ఇది చంపుకునేవరకు దారి తీస్తోంది. బెంగళూర్‌లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ భార్య హత్యకు దారి తీసింది. కర్ణాటకలోని శ్రీనివాస్‌పూర్‌కు చెందిన హరీష్ కుమార్, పద్మజలు భార్యభర్తలు. ఇద్దరూ ఉన్నత చదువులు చదివారు. వీరిద్దరు ఇంజనీరింగ్ పూర్తి చేసి, బెంగళూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.
Also read: కర్ణాటకను భయపెడుతున్న గుండెపోటు మరణాలు.. ఆస్పత్రులకు క్యూకట్టిన జనం
Husband Kills Wife
వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే చిన్నచిన్న విషయాలకే ఈ జంట తరుచూ గొడవపడేవారని, మంగళవారం రాత్రి కూడా ఇది మరింత తీవ్రంగా మారినట్లు పోలీసులు చెప్పారు. భార్యాభర్తల మధ్య వాగ్వాదం కారణంగా కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన హరీష్‌కుమార్ తన భార్య పద్మజను కడతేర్చాడు. కోపంతో భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి..తొక్కి.. ఆమె ప్రాణం పోయేంత వరకు తొక్కి చంపాడు.
Also Read: కర్ణాటకలో సీఎం మార్పు.. క్లారిటీ ఇచ్చిన డీకే శివకుమార్
Also Read: కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానం.. పైలట్ మృతి
ఆమెను హత్య చేయడానికి ముందు హరీష్ కుమార్, పద్మజల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆవేశంతో హరీష్ పద్మజను కొట్టి, ఆమెను నేలపై పడేశాడు. ఆ తర్వాత ఆమె మెడపై కాలితో తొక్కి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన బొమ్మనహళ్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. హరీష్‌ను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు. కాగా మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read: నాకు నోబెల్ బహుమతి రావాలి.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
husband-killed-wife | husband-killed-his-wife | Husband Kill Wife | husband killed wife incident | crime news | Bengaluru Incident