/rtv/media/media_files/2025/11/19/free-ai-cource-2025-11-19-18-05-02.jpg)
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Young AI for All)కి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని యువత కోసం కేంద్ర ప్రభుత్వం(central-government-scheme) కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేథపై విద్యార్థులు, ఉద్యోగులకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక కోర్సును రూపొందించింది. ‘యువ ఏఐ ఫర్ ఆల్’ పేరిట ఈ కోర్సును అందిస్తున్నది. ఈ కోర్సు 4.5 గంటల నిడివి కలిగి ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఏఐపై ప్రాథమిక అవగాహన వస్తుంది. కోర్సును చాలా సరళంగా, నిజ జీవితంలో ఉపయోగించే ఉదాహరణలతో రూపొందించారు. ఇది ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్, iGOT కర్మయోగి సహా మిగిలిన ప్రముఖ ఎడ్‌టెక్ పోర్టళ్లలో అందుబాటులో ఉంది. కోర్సు పూర్తి చేసిన వారికి భారత ప్రభుత్వం సర్టిఫికెట్ కూడా ఇవ్వనుంది. ఈ కోర్సులో మొత్తం 6 మాడ్యూల్స్ ఉంటాయి.
Also Read : తస్మాత్ జాగ్రత్త.. గీజర్ వాడుతున్నారా? వీటి గురించి వెంటనే తెలుసుకోండి..!
Government of India launches ‘YUVA AI for ALL’ - a free national course to help everyone understand Artificial Intelligence
— PIB India (@PIB_India) November 18, 2025
💠A short, simple, practical and free course to make AI accessible for everyone
💠The initiative aims to empower 1 crore (10 million) citizens with…
ఏఐ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది?
విద్య, సృజనాత్మకత, ఉద్యోగాలను ఏఐ ఎలా మారుస్తోంది?
ఏఐ టూల్స్‌ను భద్రంగా, బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించుకోవాలి?
నిజజీవితంలో ఏఐ వాడే విధానం
ఏఐ భవిష్యత్తు.. రాబోయే అవకాశాలు అనే ఆరు అంశాలు ఇందులో నేర్చుకుంటారు.
Also Read : మోటో నుంచి మరో సూపర్ ఫోన్.. అధునాతన ఫీచర్లతో రెడీ..!
రిజిస్ట్రేషన్..
ఏఐ కోర్సు(Free AI Course) నేర్చుకోడానికి futureskillsprime.in/course/yuva-ai-for-all అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. హోమ్‌పేజ్ కుడివైపు ‘ఎన్‌రోల్’పై క్లిక్ చేయాలి. గూగుల్ లేదా లింక్డిన్ ఖాతా ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. పేరు, పుట్టినతేదీ, జెండర్ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీతో ధ్రువీకరించాలి. ఐడీ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకపోయినా పరవాలేదు చివరగా చెక్‌బాక్స్‌లో టిక్ చేసి సబ్మిట్ చేయాలి.
Follow Us