Best Smart Tvs Under Rs 20k: రూ. 20వేలలో బెస్ట్ స్మార్ట్‌టీవీలు - మార్కెట్లో దుమ్మురేపుతున్న మోడల్స్ ఇవే!!

మార్కెట్‌లో బెస్ట్ స్మార్ట్‌టీవీలు కేవలం రూ.20 వేలలోపు అందుబాటులో ఉన్నాయి. అవి సౌండ్, పిక్చర్ క్వాలిటీ, ఫీచర్ల పరంగా బాగా పాపులర్ అయ్యాయి. అందులో Redmi Smart TV X Series, OnePlus Y Series, Realme Smart TV టీవీలు ఉన్నాయి.

New Update
UNDER Rs 20K Tvs

UNDER Rs 20K Tvs

మీరు రూ.20వేల లోపు ధరలో ఒక కొత్త స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఈ బడ్జెట్‌లో ప్రస్తుతం భారత మార్కెట్లో అద్భుతమైన ఫీచర్లు, క్వాలిటీతో కూడిన స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 32-అంగుళాల నుండి 43-అంగుళాల వరకు HD రెడీ, Full HD రిజల్యూషన్‌లలో ఈ టీవీలు లభిస్తున్నాయి. కొన్ని 4K టీవీలు కూడా .

ఇది కూడా చదవండి:పొరపాటున కూడా ఈ 7 కూరగాయలు నూనెలో వేయించకండి.. ఎందుకంటే!
ఇది కూడా చదవండి: 
బిల్వ పత్రాలు పరగడుపున తింటే ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడే తెలుసుకోండి

రూ.20,000 లోపు స్మార్ట్‌టీవీలు

Redmi Smart TV X Series 

Redmi Smart TV X సిరీస్ ఫీచర్లకు పేరు పొందింది. దీని 32-అంగుళాల మోడల్ టీవీ HD Ready తో వస్తుంది. అదే సమయంలో 43-అంగుళాల మోడల్ Full HD లో లభిస్తుంది. ఈ సిరీస్ టీవీ వివిడ్ పిక్చర్ క్వాలిటీ, 20W/24W డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ టీవీ OS, ప్యాచ్‌వాల్ UI, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్, బెజెల్-లెస్ డిజైన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. వీటి ధర విషయానికొస్తే.. 32-అంగుళాల టీవీ ధర రూ.12,000  నుంచి- రూ.15,000 మధ్య ఉంటుంది. అదే సమయంలో 43-అంగుళాల Full HD మోడల్ ధర రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య లభిస్తుంది.

Also Read : సింహాద్రి అప్పన్న ఆలయంలో అపశ్రుతి

OnePlus Y Series 

వన్‌ప్లస్ టీవీలు వాటి బిల్డ్ క్వాలిటీ, స్లీక్ డిజైన్‌కు ప్రసిద్ధి చెందాయి. ఇందులో గామా ఇంజిన్ (అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ), డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ టీవీ OS, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీకి OnePlus Connect యాప్ వంటి అదరిపోయే ఫీచర్లు ఉన్నాయి. 32-అంగుళాల టీవీ ధర రూ.13,000 నుంచి రూ.16,000 మధ్య ఉంటుంది. అదే సమయంలో 43-అంగుళాల Full HD మోడల్ ధర రూ.19,000 నుంచి రూ.20,000 మధ్య ఉంటుంది.

Realme Smart TV 

Realme Smart TV  బెజెల్-లెస్ డిస్‌ప్లే, 24W క్వాడ్ స్పీకర్లు, డాల్బీ ఆడియో, ఆండ్రాయిడ్ టీవీ OS, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ బిల్ట్-ఇన్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. 32-అంగుళాల మోడల్ ధర రూ.12,000 నుంచి14,000 మధ్య ఉంటుంది. అదే సమయంలో 43-అంగుళాల Full HD మోడల్ ధర రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య లభిస్తుంది. 

అలాగే Mi TV 5A Proలోని 32-అంగుళాల మోడల్ ధర రూ.13,000 నుంచి రూ.16,000 మధ్య ఉంటుంది. అదే సమయంలో 40-అంగుళాల Full HD మోడల్ ధర రూ.18,000 నుంచి రూ.20,000 మధ్య లభిస్తుంది.

Also Read : అరాచకం భయ్యా.. రూ.30వేలలోపు ది బెస్ట్ కెమెరా వివో ఫోన్లు.. ఫొటోలు పిచ్చ క్లారిటీ

4K SmartTV | tech-news-telugu | telugu tech news | tech-news

Advertisment
Advertisment
తాజా కథనాలు