/rtv/media/media_files/2025/07/05/best-camera-vivo-mobiles-unders-30k-2025-07-05-16-31-49.jpg)
best camera vivo mobiles unders 30k
తక్కువ ధరలో మంచి కెమెరా ఫోన్ కోసం చాలా మంది వెతికేస్తున్నారు. అయితే ఇప్పట్లో ఒక మంచి కెమెరా ఫోన్ కావాలంటే ఎలా లేదన్నా ఒక రూ.30 వేలు పెట్టాల్సిందే. అలాంటి ఫోన్ కోసం మీరు కూడా వెతికేస్తున్నట్లుయితే ఇది మీకు బాగా ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ ఫ్లిప్‌కార్ట్(flipkart)లో ది బెస్ట్ కెమెరా ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవి మరేవో కాదు వివో ఫోన్లు. అందరికీ తెలిసిందే.. వివో (vivo) ఫోన్లు అంటేనే కెమెరా క్వాలిటీ కలిగినవి. అందువల్ల రూ.30 వేలలో అందుబాటులో ఉన్న వివో ఫోన్లు (vivo mobiles).. వాటి కెమెరా ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Also Read : దంచుతున్న గిల్..కోహ్లీ రికార్డు ఖతం
Best Camera Vivo Mobiles Unders 30K
Vivo V50e 5G
రూ.30 వేలలో ది బెస్ట్ వివో కెమెరా ఫోన్ vivo V50e 5G. ఇది రెండు వేరియంట్లలో వచ్చింది. 8/128జీబీ వేరియంట్ ధర రూ.33,999 ఉండగా ఇప్పుడు రూ.5వేల తగ్గింపుతో కేవలం రూ.28,999లకే flipkartలో లిస్ట్ అయింది. 8/256జీబీ వేరియంట్ అసలు ధర రూ.35,999 ఉండగా ఇప్పుడు రూ.30,999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై పలు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇవి vivo V50e 5G వెనుకవైపు 50MP + 8MP కెమెరాను కలిగి ఉంది. అదే సమయంలో ముందువైపు 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.
Also Read : ఊరగాయ రుచిని పెంచడమే కాదు ఆరోగ్య సమస్యలనూ దూరం చేస్తుంది
Vivo V40e 5G
vivo V40e 5G మొబైల్ కూడా ఉంది. అయితే ఇది పైన ఉన్న మొబైల్ కంటే ముందు మోడల్. దీని 8/128 వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. దీని కెమెరా కూడా వెనుక వైపు 50MP + 8MPతో వస్తుంది. అదే సమయంలో ముందువైపు 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
Vivo V30 5G
vivo V30 5G మొబైల్ పైనున్న రెండు మోడళ్లకంటే ముందుది. ఇది కెమెరాలో అద్భుతమైనది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో వచ్చింది. 8/256జీబీ వేరియంట్ రూ.29,999గా ఉంది. ఈ ఫోన్ వెనకాల 50MP + 50MP కెమెరా ఉంది. ముందుభాగంలో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
Also Read : భూములు కొనే మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్!
Vivo V29e 5G
vivo V29e 5G మొబైల్ కూడా కెమెరా క్వాలిటీలో తోపు ఫోన్. దీని 8/256జీబీ వేరియంట్ ధర రూ.25,824గా ఉంది. ఇది ఫోన్ వెనుక భాగంలో 64MP + 8MP కెమెరా, ముందు భాగంలో 50MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
Vivo T3 Ultra
vivo T3 Ultra మొబైల్ కూడా కెమెరా పరంగా బాగుంటుంది. ఇది 8/256జీబీ వేరియంట్ రూ.29,999గా ఉంది. మొబైల్ వెనుక భాగంలో 50MP + 8MP కెమెరా ఉంది. ముందుభాగంలో 50MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.30 వేలలోపు ఉన్న ది బెస్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్లు. మీరు వాటిని కొనే ముందు ఒకసారి ఫ్లిప్‌కార్ట్‌లో రివ్యూస్ చూసి కొనుక్కోవచ్చు.
Also Read : డ్వాక్రా మహిళలకు ఉప ముఖ్యమంత్రి శుభవార్త.. ఈ నెల 10 నుంచి చెక్కుల పంపిణీ
vivo-mobiles | tech-news-telugu | telugu tech news | tech-news