/rtv/media/media_files/2025/09/30/xiaomi-17-2025-09-30-09-53-22.jpg)
Xiaomi 17
యాపిల్ మొబైల్స్(Apple Mobiles) కు గట్టి పోటీ ఇచ్చేందుకు షావోమీ సంస్థ సరికొత్త మొబైల్స్(Xiaomi New Series) ను తీసుకురానుంది. ఈ క్రమంలోనే షావోమీ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్‌ను చైనా మార్కెట్‌లో ఇటీవల విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ల ఫీచర్లు అయితే సూపర్ ఉన్నాయి. యాపిల్‌కు దీటుగా ఫీచర్లు ఉండటంతో పాటు ధరలు కూడా అందరూ కొనే విధంగా ఉండటంతో వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే షావోమీ 17 ప్రో బేస్ మోడల్ ధర 4,499 యువాన్లు ఉంది. ఐఫోన్ కంటే దీని ధర తక్కువగా ఉంది. దీంతో చాలా మంది ఈ మొబైల్స్ కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఆపిల్ డిజైన్లతో సమానంగా ఈ మొబైల్స్ ఉన్నాయి. అలాగే వీటిలో రెండు మోడళ్లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 అనే అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్ ఉంది. దీని వల్ల గేమింగ్, మల్టీటాస్కింగ్, ఏఐ అప్లికేషన్‌లు, ఫోటోగ్రఫీ వంటి అన్ని కూడా అద్భుతంగా పనిచేస్తాయి.
Xiaomi 17 Pro and 17 Pro Max are definitely the most exciting Xiaomi phones in years.
— Alvin (@sondesix) September 25, 2025
They have brought back the rear display last seen on the Mi 11 Ultra, but this time it is much bigger and more usable.
There is also a case that allows you to play a game of your choice with… pic.twitter.com/qlDPTgbBXG
డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్..
షావోమీ 17 ప్రో(Xiaomi 17 Pro) లో 6.3 అంగుళాల ఎల్టీపీఓ ఫ్రంట్ డిస్‌ప్లే ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 1 నుంచి 120 హెచ్‌జెడ్ వరకు ఉంటుంది. ఇది 12-బిట్ కలర్ డెప్త్‌ను, గరిష్టంగా 3,500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. దీనికి షావోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణ ఇస్తుంది. అదే17 ప్రో మ్యాక్స్ మరింత పెద్దగా, 6.9 అంగుళాల డిస్‌ప్లేతో అదే అద్భుతమైన స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్ల వెనుక భాగంలో ఫుల్-విడ్త్ సెకండరీ డిస్‌ప్లే ఉంది. అలాగే సెల్ఫీలు తీసుకోవడానికి, నోటిఫికేషన్లు చూడటం, మ్యూజిక్ కంట్రోల్స్, చివరకు రెట్రో గేమింగ్ కూడా ఆడవచ్చు. అలాగే కెమెరా విషయంలో కూడా షావోమీ తగ్గలేదు. ప్రో, ప్రో మ్యాక్స్ రెండింటిలో కూడా లైకా సుమ్మిలక్స్ లెన్స్‌లతో ఉన్న 50ఎంపీ సెన్సార్ ఉంది.
ఇది కూడా చూడండి: Best Deal Offer: 1+1 ఆఫరండీ బాబు.. మొబైల్ కొంటే టీవీ ఫ్రీ.. కొన్ని రోజులు మాత్రమే సమయం!
ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, డైనమిక్ రేంజ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 5ఎక్స్ వరకు ఆప్టికల్ జూమ్ కోసం పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంది. అల్ట్రా-వైడ్. సెల్ఫీ కెమెరాలను కూడా 50ఎంపీ సెన్సార్లకు అప్‌గ్రేడ్ చేశారు. నీరు, ధూళి వెళ్లకుండా IP68 రేటింగ్ ఉంది. ప్రో మోడల్ 4 మీటర్ల లోతు వరకు, ప్రో మ్యాక్స్ 6 మీటర్ల లోతు వరకు నీటిని తట్టుకోగలవు. బ్యాటరీ సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంది. షావోమీ 17 ప్రోలో 6300ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, ప్రో మ్యాక్స్​లో ఏకంగా 7500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ రెండూ 100డబ్ల్యూ వైర్డ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు ఇస్తాయి. పవర్ యూజర్ల సౌకర్యం కోసం 22.5డబ్ల్యూ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. సర్జ్ జీ2 చిప్‌తో కూడిన బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ ఉంది. ఈ ఫీచర్లు అన్ని కూడా ఐఫోన్‌కు పోటీనిస్తున్నాయి.
ఇది కూడా చూడండి: TikTok: అమెరికాలో టిక్‌టాక్ రీఎంట్రీ.. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసిన ట్రంప్