/rtv/media/media_files/2025/09/29/samsung-2025-09-29-13-08-36.jpg)
Samsung
ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్ లేదా శాంసంగ్ మొబైల్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి అదిరిపోయే న్యూస్. సాధారణంగా ఏదైనా మొబైల్ కొంటే ఛార్జర్, ఇయర్ ఫోన్స్ వంటి చిన్నవి కూడా కొనుగోలు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ వింటే మీరు ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే స్మార్ట్ టీవీ ఫ్రీగా ఇస్తారు. ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడ ఉంది? దీని పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Kitchen Items offer: మీ దగ్గర రూ.100 ఉంటే చాలు.. మార్కెట్‌లో ఉన్న కిచెన్ ఐటెమ్స్ మీ ఇంట్లోకే.. ఎలాగంటే?
ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు కొత్త శాంసంగ్ ఫోన్ కొనుగోలు చేస్తే టీవీ కూడా ఇంటికి వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S24 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే, మీకు శామ్‌సంగ్ నుండి 32-అంగుళాల స్మార్ట్ టీవీని ఉచితంగా గెలుచుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటాదని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ 32-అంగుళాల శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ ధర రూ.17999గా ఉంది. Samsung Galaxy S24 5G Snapdragon ఫోన్ ధర రూ. 74,999 ఉంది. దీన్ని మీరు ఆఫర్‌లో రూ. 39,999 కు కొనుగోలు చేయవచ్చు. మీకు ఈ ఆఫర్‌లో 47 శాతం తగ్గింపుతో లభిస్తుంది. అదనంగా దీనిపై రూ.1000 కూడా తగ్గింపు లభిస్తుంది. అంటే అన్ని ఆఫర్లు పోయి మీరు దీన్ని రూ.38,999 కు కొనుగోలు చేయవచ్చు. మీ ఫోన్ పనితీరును బట్టి ఎక్స్ఛేంజ్ విలువ మారుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8 GB RAM, 128 GB మెమరీ, స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్, 50 MP + 12 MP డ్యూయల్ రియర్ కెమెరా, 12 MP ఫ్రంట్ కెమెరా, 6.2 అంగుళాల AMOLED డిస్ప్లే, 4000 mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో ఇది నంబర్ 1 అమ్ముడైన ఆండ్రాయిడ్ ఫోన్ అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.
ఇది కూడా చూడండి: Ear Buds Offers: చీప్ ధరకే రిచ్ లుక్ ఇయర్‌బడ్స్.. దీని స్పెషల్ ఫీచర్లు చూస్తే కొనకుండా ఉండలేరు!
ఇప్పుడు EMI ఆఫర్ల విషయానికి వస్తే.. మీరు 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ EMI పెట్టవచ్చు. మీరు నెలకు రూ. 6667 చెల్లించాలి. ఇప్పుడు సాధారణ EMI విషయానికి వస్తే.. మీరు 36 నెలల వరకు కాలపరిమితి పెట్టవచ్చు. మీరు నెలకు రూ. 1400 చెల్లించాలి. ఇది 24 నెలల కాలపరిమితి అయితే దీనికి నెలకు రూ. 2000 ఖర్చవుతుంది. ఇది 18 నెలల EMI అయితే, మీరు నెలకు రూ. 2,500 చెల్లించాలి. మీరు అదే సంవత్సరానికి EMI పెడితే, దీనికి నెలకు రూ. 3600 ఖర్చవుతుంది. మీరు మీకు నచ్చిన కాలపరిమితి పెట్టవచ్చు. ఈ ఆఫర్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ డీల్స్‌ను కొనుగోలు చేయండి.