/rtv/media/media_files/2025/04/29/Ozt3IJJM4n1ZYSuGLK3C.jpg)
amazon great summer sale 2025
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ఇండియా తమ కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. తాజాగా కొత్త సేల్ ‘‘గ్రేట్ సమ్మర్ సేల్ 2025’’ ను ప్రకటించింది. ఈ సేల్ మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ సేల్ 12 గంటల ముందుగానే.. అంటే ఏప్రిల్ 30 అర్ధరాత్రి 12 గంటలకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి వాటిపై భారీ డిస్కౌంట్‌లను పొందవచ్చు. మొబైల్స్, కేస్ కవర్లు, ఛార్జర్లు, ఇయర్‌ఫోన్‌లు వంటి ప్రొడెక్టులపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది.
Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!
ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
ఈ సేల్‌లో అనేక ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. అందులో Samsung Galaxy S24 Ultra, iPhone 15, iQOO Neo 10R, OnePlus 13R, OnePlus Nord CE4 Lite, OnePlus Nord 4, Galaxy M35 5G, iQOO Z10x వంటి ఫోన్లపై తగ్గింపులు ఉన్నాయి. దీనితో పాటు HP, Lenovo, Asus వంటి బ్రాండ్ల ల్యాప్‌టాప్‌లపై కూడా భారీ డిస్కౌంట్‌లు లభిస్తాయని కంపెనీ తెలిపింది. ఇవి మాత్రమే కాకుండా స్మార్ట్‌టీవీలపై డిస్కౌంట్‌లు పొందవచ్చు. Xiaomi యొక్క 43-అంగుళాల 4K స్మార్ట్ టీవీ A ప్రో మోడల్ కేవలం రూ. 23,999 కు లభిస్తుంది. మరి కొన్ని టీవీలు 60% వరకు తగ్గింపుతో లభిస్తాయి.
Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం
ఆఫర్లు
ఈ సేల్‌లో పలు బ్యాంక్ ఆఫర్లు పొందవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా EMI ఉపయోగించి షాపింగ్ చేస్తే 10% తక్షణ తగ్గింపు లభిస్తుంది. అలాగే Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ ద్వారా 5% క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్‌తో చెల్లించే వారికి 10% వరకు అదనపు పొదుపు కూడా లభిస్తుంది. దీనితో పాటు పాత వస్తువులను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా కూడా మరింత సొమ్మును ఆదా చేసుకోవచ్చు. అలాగే నో-కాస్ట్ EMI ఆఫర్లు ఉన్నాయి.
Also read : Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్
tech-news | tech-news-telugu | telugu tech news | amazon-deals | amazon-great-summer-sale