Amazon Great Indian Festival: ఇక రెడీ అయిపోండి.. అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ డేట్‌ ఫిక్స్‌

ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏటా నిర్వహించే వార్షిక గ్రాండ్ సేల్ ''గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025'' తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్‌ మొదలుకానుందని పేర్కొంది.

New Update
Amazon Great Indian Festival Sale 2025 Date Announced

Amazon Great Indian Festival Sale 2025 Date Announced

ప్రముఖ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏటా నిర్వహించే వార్షిక గ్రాండ్ సేల్ ''గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025'' తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి ఈ ఆఫర్‌ మొదలుకానుందని పేర్కొంది. ఎన్నిరోజుల వరకు ఈ సేల్ జరుగుతందనేది మాత్రం అమెజాన్ వెల్లడించలేదు. ప్రైమ్ యూజర్లకు 24 గంటల ముందుగానే ఈ ప్రత్యేక ఆఫర్లకు యాక్సె్స్ ఉంటుంది. అమెజాన్ సంస్థ ఇప్పటికే తన యాప్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్ల రానున్నాయంటూ టీజర్‌ను కూడా రిలీజ్ చేసింది. 

Also Read: మరో ఘోరం.. వేరు కాపురం పెడదామన్న భార్య.. ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త!

ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఇంకా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు భారీ డిస్కౌంట్‌తో అందుబాటులోకి రానున్నాయి. మరీ ముఖ్యంగా చూసుకుంటే శాంసంగ్, రియల్‌మీ, డెల్, యాపిల్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం వరకు డిస్కౌంట్‌తో భారీగా ఆఫర్లు ఉండనున్నాయని ఇప్పటికే అమెజాన్ తన టీజర్‌లో వెల్లడించింది. 

Also Read: నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు నిషేధం

SBI క్రెడిట్‌ కార్డు నుంచి EMI లావాదేవీలపై ఈ డిస్కౌంట్‌ వర్తించనుంది. కొనుగోలుదారుల వడ్డీరహిత ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛైంజ్ బోనస్ సదుపాయాలు కూడా పొందొచ్చు. యాక్సెసరీస్‌, ఎలక్ట్రానిక్స్‌పై HP, బోట్, సోనీ లాంటి బ్రాండ్లపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ లభించనుంది. ప్రతీ ఏడాది కూడా దసరా, దీపావళి సీజన్‌లో జరిగే ఈ సేల్‌కు కస్టమర్ల నుంచి ఏటా మంచి స్పందన వస్తోంది. అయితే ఈసారి కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో వచ్చింది. దీంతో ఈ ఏడాది ఇంకా అనేక మంది అమెజాన్‌లో వస్తువులు కొనుకునే అవకాశాలున్నాయి. 

Also Read: సంచలన వీడియో.. సమోసా కోసం గొడవ.. భర్తను పొట్టు పొట్టు కొట్టిన భార్య..!

Advertisment
తాజా కథనాలు