Eluru: జిల్లా జైలులో మహిళా ఖైదీ ఆత్మహత్య!
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
భర్త హత్య కేసులో నిందితురాలిగా ఉన్న రిమాండ్ ఖైదీ శాంతకుమారి ఏలూరు జిల్లా జైలులో ఆత్మహత్య చేసుకుంది.భర్త బోసుబాబును హత్య చేసిన నేరం కింద పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
బ్యాంకులో తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు ఓ నలుగురు మహిళలు ఏకంగా కట్టుకున్న భర్తలు చనిపోయినట్లుగా మరణ ధృవీకరణ పత్రాలను బ్యాంకుకు సమర్పించారు.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌లో చోటుచేసుకుంది. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును బయటపెట్టారు.
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం బయటపడింది. బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని సెక్రటరీ పద్మావతి ఆరోపిస్తున్నారు.
యూపీలో మరో దారుణం జరిగింది. అయోధ్యకు చెందిన ఓ మహిళపై మలీహాబాద్‌లో సామూహిక అత్యాచారం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న ఆమెను కిడ్నాప్ చేసిన ఆటో డ్రైవర్, మరికొంతమంది కామవాంఛ తీర్చుకుని గొంతు నులిమి చంపేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఏపీ ఏలూరులో వివాహితపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతోంది. ఉండికి చెందిన మహిళను లైంగిక కోరిక తీర్చాలని లేదంటే భర్తను చంపేస్తామంటూ రవి, సోము మరికొంతమంది రేప్ చేశారు. నగ్న వీడియోలు తీసి డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేయగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏపీ విశాఖ పట్నంలో దారుణం జరిగింది. ఉమెన్స్ డే రోజున మేఘాలయ హోటల్లో రోజా అనే మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. ఎన్ఆర్ఐ డాక్టర్. పి.శ్రీధర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకుందా, లేక చంపేశారా అనే విషయం తెలియాల్సివుంది.
ఉమెన్స్ డే రోజే ఏపీలో ఘోరం జరిగింది. ముమ్మిడివరం అనాతవరంలో మాలతి అనే పక్కింటి మహిళపై జయ రామకృష్ణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. పిల్లల గొడవలే ఇందుకు కారణం కాగా మాలతి తల లోతుగా తెగింది. ఆమెను అస్పత్రికి తరలించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వాలంటూ NCP SP నేత రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపదీకి లేఖ రాశారు. మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో శిక్ష లేకుండా ఈ వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో ఆశకు హద్దుండాలంటూ ఆమెపై మగజాతి దుమ్మెత్తిపోస్తోంది.