Crime: ఎయిర్‌పోర్టు దగ్గర దారుణం.. విదేశీ మహిళను చంపి.. రెండు ముక్కలుగా నరికి!

బెంగళూర్‌ కెంపేగౌడ ఎయిర్‌పోర్టు దగ్గర దారుణం జరిగింది. నైజీరియాకు చెందిన 30ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. డెడ్ బాడీ రెండు ముక్కలుగా కోసి చెట్టికింద పడేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ సుజీత్‌ తెలిపారు.  

New Update
murder

Nigerian woman murdered at Bengaluru Kempegowda Airport

Crime: బెంగళూర్‌లో ఘోరం జరిగింది.ఎయిర్ పోర్ట్‌కు దగ్గరలో మరో విదేశీ యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హతమార్చి రెండు ముక్కలుగా నరికిన ఘటన సంచలనం రేపుతోంది. చదువు, ఉపాధి కోసం వచ్చిన ఆమెను నమ్మించి అత్యాచారం చేసి చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తుండగా వివరాలు ఇలా ఉన్నాయి. 

లైంగిక దాడి చేసి చంపేశారా?

ఈ మేరకు బెంగళూరు శివారులో నైజీరియాకు చెందిన (30)ఏళ్ల యువతిని గుర్తు తెలియని వ్యక్తులు మర్డర్ చేశారు. కెంపేగౌడ విమానాశ్రయ మార్గంలోని చప్పరదకల్లు రహదారిలో రెండు ముక్కలుగా కోసి పడేసి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు చెట్టుకింద డెడ్ బాడీ గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతురాలి ఆనవాళ్ల ఆధారంగా నైజీరియా దేశస్థురాలిగా అంచనా వేశారు. అయితే ఆమె వివరాల కోసం నగరంలో ఉంటున్న నైజిరియా, సౌత్ ఆఫ్రికా, వివిధ దేశాలకు సంబంధించిన వారిని విచారిస్తున్నారు. లైంగిక దాడి చేసి చంపేశారా? లేదా ఇంకేదైన కారణం ఉందా అనే కోణంలో పరిశీలిస్తున్నామని, హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని డీసీపీ సుజీత్‌ తెలిపారు. 

Also Read: ఆ వ్యాధులు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తాగొద్దు.. షాకింగ్ విషయాలు!

ఇదిలా ఉంటే.. గుజరాత్‌లో దారుణం జరిగింది. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ ఉపాధ్యాయ వృత్తినే అవమానించేలా ప్రవర్తించింది. ట్యూషన్‌కు వచ్చే అబ్బాయితో లేచిపోయింది. ఏకంగా నాలుగు రాష్ట్రాలు దాటి ప్రయాణించింది. చివరకు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు రాజస్థాన్‌ సరిహద్దులో ఓ ప్రైవేట్ బస్సులో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. 

ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

 bengalore | murder | nigeria | women | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు