Varanasi: ఫిబ్రవరి 5 వరకు అక్కడ పాఠశాలలు బంద్
ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు భక్తులు వారణాసి కూడా వెళ్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారణాసి మేజిస్ట్రేట్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటించింది.