/rtv/media/media_files/2025/04/11/QZe8q8iXSIfmqH3j8SJk.jpg)
modi gang rape
యూపీలోని వారణాసిలో 19ఏళ్ల యువతిపై 23 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. శుక్రవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసికి చేరుకున్న మోదీ.. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించడానికి ముందు రూ.3 వేల 880 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతకంటే ముందు వారణాసిలో దిగిన వెంటనే, 19 ఏళ్ల యువతిపై ఇటీవల జరిగిన దారుణమైన అత్యాచార సంఘటన గురించి వారణాసి పోలీసు కమిషనర్, డివిజనల్ కమిషనర్, జిల్లా మేజిస్ట్రేట్ నుండి మోదీ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మోదీ ఆదేశించారు.
Immediately upon landing in Varanasi, Prime Minister Narendra Modi received a detailed briefing from the Police Commissioner, Divisional Commissioner, and District Magistrate of Varanasi regarding the recent criminal rape incident in the city. He instructed them to take the… pic.twitter.com/85V2wSkfDw
— ANI (@ANI) April 11, 2025
మత్తు ఇచ్చి చాలా రోజుల పాటు అత్యాచారం
ఈ కేసులో, మొత్తం తొమ్మిది మంది నిందితులను జిల్లా, సెషన్స్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఏప్రిల్ 4న బాధితురాలు అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి 9 మందిని అరెస్టు చేశామని, మిగిలిన నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. లాల్పూర్ పాండేపూర్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. యువతిని ప్రలోభపెట్టి తీసుకెళ్లి మత్తు ఇచ్చి చాలా రోజుల పాటు అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. 7 రోజుల వ్యవధిలో 23 మంది తనపై అత్యాచారం చేశారని బాధితురాలు ఆరోపించింది.
Also read : HYD: ఇన్నాళ్ళూ లీజ్, ఇప్పుడు ఓనర్..లులూ యాజమాన్యం చేతికి మంజీరా మాల్