Varanasi gang rape: ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్స్ యువతికి మత్తుమందు ఇచ్చి.. 23 మంది గ్యాంగ్‌రేప్

వారణాసిలో ఇంటర్ సెకండ్ ఈయర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని కేసు నమోదైంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఏప్రిల్ 6న FIR నమోదు చేశారు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి 7 రోజులు బంధించి 23మంది అత్యాచారం చేశారని యువతి ఆరోపించింది.

New Update
UP gang rape

UP gang rape Photograph: (UP gang rape)

ఇంటర్మీడియేట్ చదువుతున్న యువతిని ఏడు రోజులు బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు 23 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 వరకు 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై 20 మందికి పైగా సామూహిక అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ పోలీసులు 23 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో 11 మంది గుర్తు తెలియని వారు. ఇప్పటివరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సామూహిక అత్యాచార సంఘటనకు సంబంధించి ఏప్రిల్ 6న లాల్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది.

Also read: Mamata Banerjee: త్వరలోనే నన్ను అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్

సదరు యువతి మార్చి 29న వారణాసిలోని పిషాచ్‌మోచన్ ప్రాంతంలో హుక్కా బార్‌కు ఓ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లింది. అప్పటినుంచి ఆమె కనబడకుండా పోయింది. నిందితులు యువతికి ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి హోటళ్లకు తీసుకెళ్లారు. తర్వాత వారితోపాటు మరోకొందరు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో కొంతమంది నిందితులు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుసని బాధితురాలు ఫిర్యాదులో తెలిపారు. అయితే ఇంటర్ సెంకడ్ ఈయర్ చదువున్న ఆ యువతి మేజర్. ఏప్రిల్ 4న మిస్సింగ్ కేసు ఫైల్ అయ్యింది.

Also Read: Lady Aghori: ప్రభాస్ ఇంటి పక్క ఆ విల్లాపై అఘోరీ క్లారిటీ.. అది మాత్రమే నిజం

పోలీసుల కథనం ప్రకారం, బాధితురాలు స్పోర్ట్స్ కోర్సులో అడ్మిషన్ కోసం ప్రిపేర్ అవుతుంది. రన్నింగ్ ప్రాక్టీస్‌ కోసం వెళ్తున్న ఆమెను ఓ ఫ్రెండ్ పిషాచ్మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్‌కు తీసుకెళ్లాడు. అక్కడ వారితో మరికొందరు ఫ్రెండ్ జాయింన్ అయ్యారు. తనకు ఇచ్చిన కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఆపై సిగ్రా ప్రాంతంలోని వివిధ హోటళ్లకు తీసుకెళ్లి, అక్కడ తనపై సామూహిక అత్యాచారం చేశారని బాలిక ఆరోపించింది. నిందితుల్లో కొందరు ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్రెండ్స్, మరి కొందురు మాజీ క్లాస్‌మేట్స్. బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హుక్కా బార్‌లోని సిబ్బందిని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు