Varanasi : అన్యమతస్థుడితో అక్రమసంబంధం.. అడ్డుగా ఉన్నాడని 10 ఏళ్ల కొడుకును లేపేసిన తల్లి!

వారణాసిలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన తాజాగా  వెలుగులోకి వచ్చింది, ఒక తల్లి తన ముస్లిం ప్రేమికుడితో ఉన్న అక్రమ సంబంధానికి10 ఏళ్ల కుమారుడు అడ్డుగా ఉన్నాడని  చంపేసింది.

New Update
varanasi

ఎన్‌కౌంటర్‌లో నిందితుడు ప్రేమికుడు అరెస్టు

వారణాసిలోని రామ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దిగ్భ్రాంతికి గురిచేసే సంఘటన తాజాగా  వెలుగులోకి వచ్చింది, ఒక తల్లి తన ముస్లిం ప్రేమికుడితో ఉన్న అక్రమ సంబంధానికి10 ఏళ్ల కుమారుడు అడ్డుగా ఉన్నాడని  చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 10 ఏళ్ల సూరజ్ అనే బాలుడు మంగళవారం నుండి ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఎటువంటి ఆధారాలు దొరకకపోవడంతో  రాంనగర్ పోలీస్ స్టేషన్‌లో బాలుడు తప్పిపోయినట్లుగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు సమయంలో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. 

Also Read : Congress : జూబ్లీహిల్స్ బరిలో చిరంజీవి, నాగార్జున.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదేనా..!?

ఆ పిల్లవాడి తల్లి సోనా శర్మకి ఫైజాన్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉందని తేలింది. దీంతో  పోలీసులు ఆ పిల్లవాడి తల్లి సోనా శర్మ  ఆమె ప్రియుడు ఫైజాన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఇద్దరూ అసలు విషయాన్ని వెల్లడించారు. తామే సూరజ్‌ను హత్య చేశామని ఒప్పుకున్నారు. పిల్లవాడని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి  చంపానని ఫైజాన్ పోలీసులకు వెల్లడించాడు. ఆ పిల్లవాడు తమ మధ్య అడ్డంకిగా ఉన్నాడని, అందుకే తాను అతడిని చంపేశానని ఫైజాన్ చెప్పాడు. నేరం ఒప్పుకున్న తర్వాత పోలీసులు నిందితులిద్దరినీ ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. కానీ ఈ సమయంలో ఫైజాన్‌ ఎదరుతిరిగాడు. అకస్మాత్తుగా ఓ పోలీసు అధికారి తుపాకీని లాక్కొని కాల్పులు జరపడం ప్రారంభించాడు. 

Also Read :  AP SI : ఖాకీ కాదు కాట్రాజ్.. కేసు పెట్టడానికి వస్తే కోరిక తీర్చాలంటూ.. ఏం చేశాడంటే?

రెండేళ్ల క్రితం భర్త చనిపోగా 

పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసులు ప్రతిఘటించి ఎన్‌కౌంటర్‌ చేయగా బుల్లెట్ ఫైజాన్ కాలికి తగిలింది. గాయపడిన స్థితిలో పోలీసులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు.  పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. కన్న తల్లి తన సొంత బిడ్డ పట్ల  ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిచిందని స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. సూరజ్ చాలా తెలివైన పిల్లవాడని అతని జీవితం ఇంత దారుణంగా ముగిసిపోతుందని ఊహించలేదని వాపోతున్నారు. పోలీసులు నిందితురాలైన తల్లిని,  ఆమె ప్రియుడు ఫైజాన్ ఇద్దరిపై హత్య, నేరపూరిత కుట్ర, హత్యాయత్నం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  కాగా సోనా శర్మ భర్త రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఫైజాన్ తో ఆమె అక్రమ సంబంధం నడుపుతోంది.  సోనా శర్మ తన పదేళ్ల కుమారుడు సూరజ్, ఐదేళ్ల కుమార్తెతో మచ్చర్‌హట్టాలో నివసిస్తోంది. 

Also Read :  Snake In Curry Puff : ఇదెందయ్యా..ఇది  కర్రీ పఫ్‌ లో పాము పిల్ల.. షాక్ తో ఆ మహిళ ఏం చేసిందంటే..

Advertisment
తాజా కథనాలు