Kumbhmela Accident: కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. హృదయవిదారక దృశ్యాలు!

వారణాసిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళాకు వెళ్తున్న భక్తుల జీపు మీర్జామురాద్ సమీపంలోని జిటి రోడ్డులో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా కర్ణాటకకు చెందినవారే.

New Update
varanasi accident

Kumbh Mela devotees vehicle accident

Kumbhmela Accident: యూపీ వారణాసిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో కుంభమేళాకు వెళ్తున్న జీపు మీర్జామురాద్ సమీపంలోని జిటి రోడ్డులో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

కర్ణాటకకు చెందినవారే..

భక్తులు కర్ణాటకకు చెందినవారని మీర్జామురాద్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అజయ్ రాజ్ వర్మ తెలిపారు. క్షతగాత్రులను స్థానికుల సహాయంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

ప్రైవేట్ బస్సు ట్రక్కు ఢీ..

ఇదిలాఉంటే.. గుజరాత్ (Gujarat) లోని కచ్(Kachchh) ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం గుజరాత్‌లోని కేరా ముంద్రా రోడ్డులో(Kera Mundra Road) 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మందికి పైగా గాయాలు అయినట్లు తెలిసింది.
వారిలో కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన బాధితులకు సమీపంలోని ఆసుపత్రుల్లో వైద్య సహాయం అందుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వర్గాలు సూచిస్తున్నాయి. ఈ ప్రమాదం ధాటికి బస్సు ముందర భాగం నుజ్జునుజ్జయింది. ప్రయాణికులు ఎగిరి రోడ్డుపై పడ్డారు. అందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: Illegal Relationship: బయటపడ్డ జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకీరామ్‌ రాసలీలలు

కేరా ముంద్రా రోడ్డులో 40 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అధికారులు త్వరగా అంబులెన్స్‌లు, పోలీసు యూనిట్లతో సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ, ప్రమాదం గురించి మరిన్ని వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్‌పై కేసులు నమోదు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు