Varanasi : శివశివా.. కాశీలో 21 మంది నకిలీ పూజారుల అరెస్టు

మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా వారణాసిలోని  కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారులుగా నటిస్తూ  భక్తులును మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

New Update
varanasi fake

మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా వారణాసిలోని  కాశీ విశ్వనాథ ఆలయంలో పూజారులుగా నటిస్తూ  భక్తులును మోసం చేస్తున్న 21 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆలయంలో దర్శనం, పూజల ఏర్పాటు పేరుతో అనధికార వ్యక్తులు డబ్బు తీసుకుంటూ సందర్శకులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గత కొన్ని రోజులుగా అనేక ఫిర్యాదులు అందాయని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) దశాశ్వమేధ అతుల్ అంజన్ త్రిపాఠి తెలిపారు.

నిందితులపై చట్టపరమైన చర్యలు

ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. 21 మంది నకిలీ పూజారులను అరెస్టు చేశామన్నారు.  నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.  ఈ నకిలీ పూజారులు సులభంగా దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చి, ఒక్కొక్కరికి రూ.500 నుండి రూ.1000 వరకు వసూలు చేసేవారు. డబ్బు తీసుకున్న తర్వాత, భక్తులను ఆలయ ప్రాంగణం వైపు తీసుకెళ్లినట్లు నటించి, వారిని ఏదో ఒక వీధిలో వదిలిపెట్టి అదృశ్యమయ్యేవారు. భక్తులు ఎవరికీ పడితే వారికి డబ్బులు ఇచ్చి మోసం పోకూడదని జాగ్రత్తగా ఉండాలన్నారు.  

Advertisment
తాజా కథనాలు