Indian Railway: ఈ రైళ్ల టైమింగ్స్ మారాయ్.. జనవరి 1 నుంచి అమల్లోకి!
దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. పలు రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు చేసింది. విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ తాజా మార్పుతో ఉదయం 6 గంటలకే ప్రారంభం కానుంది. 2025 జనవరి 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని వెల్లడించింది.