న్యూ ఇయర్ వేళ రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. ఆగిపోయిన IRCTC

న్యూ ఇయర్ వేళ IRCTC సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి IRCTC వెబ్‌సైట్ పనిచేయడం లేదు. దీంతో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే వారికి తీవ్ర ఇబ్బంది ఏర్పడటంతో నెటిజన్లు సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు.

New Update
IRCTC Down

IRCTC Down Photograph: (IRCTC Down)

న్యూ ఇయర్ వేళ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ రోజు ఉదయం తత్కాల్ టికెట్లు తీసుకునే సమయంలోనే IRCTC వెబ్‌సైట్ ఆగిపోయింది. ఉదయం 10 గంటల నుంచి IRCTC వెబ్‌సైట్ డౌన్ అయ్యింది.

ఇది కూడా చూడండి: Buttermilk: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం

మొదటిసారేం కాదు..

ఇలా జరగడం ఇదేమి మొదటిసారి కాదు.. ఈ నెలలో ఇది మూడోసారి. దీంతో ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. వెంటనే కస్టమర్ కేర్‌కి కాల్‌ చేస్తే.. సైట్ మెయింటెనెన్స్‌లో ఉందని చెప్పారని సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు

తత్కాల్ టికెట్లు రైలు ప్రయాణానికి ఒక రోజు ముందు బుక్ చేసుకోవాలి. సరిగ్గా తత్కాల్ టికెట్లు బుక్ చేసే సమయానికి ఇలా జరగడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. 

ఇది కూడా చూడండి: Kadapa: పోలీస్‌ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి

ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు