రైళ్లో టికెట్ లేకుండా ప్రయాణించేవారికి షాక్.. రైల్వేశాఖ కీలక నిర్ణయం

అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్‌ 10 వరకు టికెట్‌ లేకుండా ప్రయాణించేవారిని కట్టడి చేసేందుకు భారత రైల్వేశాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనుంది. ఈ మేరకు 17 జోన్ల జనరల్‌ మేనేజర్‌లకు లేఖ రాసింది.నివేదికలను నవంబర్‌ 18 నాటికి పంపించాలని కోరింది.

author-image
By B Aravind
New Update
Train

భారత రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రానున్న పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని టికెట్‌ లేని ప్రయాణికులకు చెక్‌ పెట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా.. అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అలాగే అక్టోబర్ 25 నుంచి నవంబర్‌ 10 వరకు టికెట్‌ లేకుండా ప్రయాణించేవారిని కట్టడి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనుంది. ఈ మేరకు 17 జోన్లలో ఉన్న జనరల్‌ మేనేజర్‌లకు రైల్వేశాఖ లేఖ రాసింది. తనిఖీల నివేదికలను కూడా నవంబర్‌ 18 నాటికి పంపించాలని కోరింది. 

Also Read: వామ్మో.. రైల్లోనే ప్రత్యక్షమైన పాము.. వీడియో వైరల్

అయితే టికెట్‌ లేకుండా ప్రయాణించే వారిలో పోలీసులే ఎక్కువగా ఉన్నారని రైల్వే కమర్షియల్ అధికారులు పేర్కొన్నారు. ఇటీవల గాజియాబాద్‌ - కాన్పుర్‌ సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించగా.. పలు రైళ్లలో ఏసీ కోచ్‌లలో వందలాది మంది పోలీసులు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. వాళ్లందరికీ కూడా జరిమానా విధించినట్లు చెప్పారు. ఆర్టీఐ వివరాల ప్రకారం చూసుకుంటే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.61 కోట్ల మంది టికెట్ ఉల్లంఘనదారులు పట్టబడ్డారు. వాళ్ల నుంచి జరిమానా రూపంలో భారత రైల్వేశాఖ రూ.2,231 కోట్లు వసూలు చేసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు