Kumbhamela: ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లాలనుకుంటున్నవాళ్లకు రైల్వేశాఖ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని మహా కుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి-బెనారస్ ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. Also Read: Aus Vs IND: ఇప్పుడు అరవండి మావా... బుమ్రా సంబరాలు మామూలుగా లేవుగా! ఈ స్పెషల్ రైలు శనివారం రాత్రి 8.55 గంటలకు తిరుపతిలో మొదలవుతుంది. సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ చేరుతుంది. జనవరి 20, ఫిబ్రవరి 10, 17, 24 తేదీల్లో ఈ రైలు తిరుగు ప్రయాణంలో.. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు బెనారస్‌లో మొదలవుతుంది.ఈ రైళ్లు ఏపీలోని 'గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం' రైల్వే స్టేషన్‌లలో ఆగుతాయి. Also Read: Koneru Humpy: ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ విజేతగా కోనేరు హంపి! అంతేకాదు జనవరి 26, ఫిబ్రవరి 2 తేదీల్లో నర్సాపూర్-బెనారస్ ప్రత్యేక రైలు కూడా పట్టాలెక్కనుంది. ఈ ప్రత్యేక రైలు నర్సాపూర్‌లో ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.45 గంటలకు బెనారస్ చేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు తిరుగు ప్రయాణంలో జనవరి 27, ఫిబ్రవరి 3 తేదీల్లో బెనారస్‌లో సాయంత్రం 5.30 కు బయలుదేరుతుంది. Also Read: Nitish Kumar: కన్నీళ్లు పెట్టించే నితీష్ రెడ్డి బయోగ్రఫీ.. కొడుకు కోసం ఉద్యోగాన్ని వదులుకున్న తండ్రి విశాఖపట్నం నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైళ్లను నడపాలని తూర్పుకోస్తా రైల్వే వివరించింది. విశాఖపట్నం - గోరఖ్‌పూర్- దీన్‌దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ల మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ పట్టాలెక్కుతాయి. జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లో విశాఖ- గోరఖ్‌పూర్ స్పెషల్ ట్రైన్.. ఆదివారం రాత్రి 10.20 గంటలకు బయల్దేరి మంగళవారం రాత్రి 20.25 గంటలకు ఈ రైలు గోరఖ్‌పూర్ చేరనుందని అధికారులు తెలిపారు. జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో ఈ రైలు తిరుగు ప్రయాణంలో భాగంగా బుధవారాల్లో మధ్యాహ్నం 14.20 గంటలకు బయల్దేరి.. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాసలో ఆగుతుంది. Also Read: Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు! జనవరి 9, 16, 23, ఫిబ్రవరి 6, 20, 26 తేదీల్లో.. విశాఖపట్నం- దీన్‌దయాళ్ ఉపాధ్యాయ రైలు.. విశాఖపట్నం నుంచి గురువారం సాయంత్రం 5.35 గంటలకు బయల్దేరి శనివారం ఉదయం 4.30 గంటలకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి శనివారం బయల్దేరి సోమవారం ఉదయం 3.25 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు సింహాచలం, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్‌లలో స్టాప్ ఉంది.