Accident: హైదరాబాద్లో లారీ బీభత్సం..ట్రాఫిక్ పోలీసు దుర్మరణం!
హైదరాబాద్లో లారీ బీభత్సం సృష్టించింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద విధుల్లోవున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.