Pending Challans: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏపీలో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మూడు నెలల్లో 667 మంది మృత్యువాత పడ్డారని.. నిబంధనలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం పోలీసులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని వ్యాఖ్యలు చేసింది. పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదని.. నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కూడా చదవండి: శీతాకాలంలో అరటిపండు తినడం మంచిదేనా? తెలంగాణలో స్ట్రిక్ట్.. తెలంగాణలో ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమిస్తున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 వేల 113 మంది డ్రైవింగ్ లైసెన్స్‌లను 6 నెలల పాటు రద్దు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రద్దు చేసిన లైసెన్స్ లలో దాదాపు 70 శాతం డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన మందుబాబులదే అని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలను నడపడం చట్ట విరుద్ధం. మొదటి దొరికితే ఫైన్ వేసి కోర్టు ముందు హాజరుపర్చుతారు పోలీసులు. అయితే మూడోసారి కూడా మద్యం సేవించి పోలీసులకు చిక్కితే కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వారి లైసెన్స్ లను రద్దు చేస్తున్నారు అధికారులు. ఇది కూడా చదవండి: మంచు ఫ్యామిలీ వివాదాలకు సౌందర్యతో లింక్.. అసలు విషయం తెలిస్తే షాక్! రద్దైన లైసెన్స్ లలో... 70 శాతం మందు బాబులవి,* మిగతా 30 శాతం ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, హెవీ లోడ్ తో రోడ్లపై భారీ వాహనాలను నడుపుతూ పట్టుబడ్డ వాహనదారులవి ఉన్నాయి. అయితే గతంలో కంటే ఈసారి మద్యం సేవించి పోలీసులకు పట్టుబడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని.. అందులో ఎక్కువ మంది మైనర్లు, యువత ఉండడం ఆందోళన కలిగించే అంశం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి అల్లు అర్జున్.. PKతో రహస్య భేటీ! ఇది కూడా చదవండి: TG Crime: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కుటుంబం బలి